*విద్యావిధాత గురువు*;-*మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట**చరవాణి:9949144820*
 1.
*తే.గీ*
వ్యాస పూర్ణిమయందున-వందనములు
గురువుగారికినిడుదును-గుండెనిండ
బ్రతుకుదెరువునుజూపియు-భద్రపచి
ప్రగతి పథమున నడిపించి-పటిమబెంచె 
2.
*తే.గీ*
బుద్ధిమాటలునేర్పియు-నొద్దికగనుఆటపాటలయందున- మేటిజేసి మంచినడతలోమనలను-మాన్యులుగను
మలచిదాపునజేర్చును-వలచిగురువు
3.
*ఆ.వె*
దాచుకొనకచదువు-దానముజేయుచు
విద్యవిలువదెలిపి-విపులముగను
జ్జానసుధలుమనకు-ఘనముగానొసగిన
గొప్పవాడుగురువు-మెప్పుపొందు
4.
*ఆ.వె*
అంధకారమందు-నలరారుశిష్యుల
వెలుగుపథమునడిపి-వేగిరమున
సకలవిషయాలనెల్లను-చక్కగాదెలిపిన
వందనీయుడతడు-వసుధయందు
           ****.    ****

కామెంట్‌లు