మా పల్లె .. సంక్రాంతి !; కోరాడ.

 సంక్రాంతిని చూడాలంటే... 
మా పల్లెలకు రావలసిందే !
ఇల్లిల్లూ... ప్రతివీధీ... ఊరూ, వాడా... ఎక్కడచూసినా... 
సంక్రాంతి శోభే !!
ప్రతిముంగిలీ చిక్కని పెద్ద కళ్ళాపిలతో.... ముచ్చటగొలిపే ముగ్గులతో... పచ్చని మామిడి తోరణాలతో... ప్రతిఇల్లూ తెల్లని సున్నాన్నో జిగేలు మను రంగులనో పులుముకుని ముస్తాబై పోతుంది !
నెలగంట పెట్టినది మొదలూ... 
ప్రతిరోజూ పొద్దుపొడవక ముందే... హరిదాసు భజనతో  
మేలుకొలుపు... !
వీధికొక పెద్ద మంటతో భోగి !
ముత్తైదువులు పశుపు లు పోయించుకునే సంక్రాంతి.. !
పశువుల పండుగ కనుమ !!
విందులు, వినోదాలు, డూ డూ బసవన్నలు... కొత్తల్లుళ్ళూ, పేకాటలు,కోడె పందాలు !!
ముచ్చటగొలిపే మూడురోజుల 
హుషారుగొలుపును గ్రామాల లోనే... మా గ్రామాలలోనే... !!
అందుకే... సంక్రాంతిని చూడాలంటే.. మా గ్రామాలకు 
రావలసిందే... !!
       *******

కామెంట్‌లు