కవాతు!?; -ప్రతాప్ కౌటిళ్యా ( కె ప్రతాప్ రెడ్డి)
అరణ్య సైన్యం ప్రారంభమైంది
గమ్యం మార్గం అంతా మాయమైంది
ఆకుపచ్చని కవాతులో
భూమి భూమంతా పచ్చ బడ్డది!!

నిలబడ్డది కదల లేదు కదా అని
భ్రమ లో ఉన్నట్లు ఉన్నావు
భయపడడం ఇప్పుడు నీ వంతు
ఆక్రమిస్తే ఆకాశమంత ఎత్తు కూడా ఎదగ గలదు
బదులుగా నీవు భూమిని వదులుకోవాల్సి వస్తుంది !!?

ఇన్నాళ్లు వేళ్ళు మాత్రమే పరిచయం
కళ్ళు కూడా చెట్టుకు పుట్టుకొచ్చాయని తెలిస్తే
దూరం చూపులో భూమి నీకు దూరమవుతుంది!?

అంచనా వేయకు కొంచెం కొంచెం గాలిని తిని
గాలి గోళాల్నీ సృష్టించగలదు !!
నీటిని నీటి భూగోళం సృష్టించినట్లు !?
నీవు కనిపెట్టే లోపే
మట్టిని మొత్తాన్ని తినేయ  గలదు
నీవు తింటున్నా అన్నం అప్పుడు ఆకాశంలో అమ్మ పడుతుంది !?

మలిచేది రెక్కలు కుక్క గొడుగులు కాదు
ఎగరడానికి చెట్టుకు ఇప్పుడు
రెక్కలు ఉన్నాయి!!?
చెరసాలలో బంధించి న పచ్చని రక్తం
నీలాకాశం మేఘాలై పరుగెడుతున్న వి!

ఎర్రటి రక్తం నిప్పులో మరుగుతుంది
కాస్త గడ్డ కడితే
నిన్ను పాతాలనీ పాతాళంలో నీకు సమాధి శాసనం రాయాలని
వ్యూహం రాసి స్తున్నది!!

కాలం చెల్లిన కలుపు మొక్కలు కాదు
మొక్కల్నీ  కలిపిన అంతరిక్షం నక్షత్రాలు అవి
ఆది అంతం ఇది
యుద్ధం చేసేందుకు నీవు మిగలవు!?

రక్షణ దళాలు కదిలిన
అంతరిక్షం ఇప్పుడు నా అధీనంలో ఉంది
పచ్చని సైన్యం కవాతు నిదానంగా
నీకు పంపుతున్న సందేశం విషం !!?
నీవు పాతిపెట్టిన చెట్టు ఇప్పుడు ఆయుధం చేపట్టింది !!?

Pratapkoutilya district president
SRI SRI KALAVEDIKA
Lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏❤️🙏
8309529273

కామెంట్‌లు