సంక్రాంతి శుభాకాంక్షలుతో;-జె.నిర్మలతెలుగు భాషోపాధ్యాయురాలు,జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొండపాక
 సీ.మా
సంక్రాంతి సందడి సంబరములతోడ
నూరువాడ మెరియు నుర్వి యందు
పాడిపంటలతోడ పల్లె సీమంతయు
ధాన్యరాశులునిండు దండిగాను
ముద్దులొలుకుముగ్గు ముంగిట్లొ వేయుచు
పల్లె నారిమణులు పడగ పోటి
కొళ్ళ పందెపు యాట గొప్పగా నాడుచు
నుల్లాసముంగల్గ యువకులంత
భోగి మంటలు బెట్టి పొందుగా ముంగిట్లొ
జనుల సందడి నెంతయో జగతి వెల్గు
బిడ్డల నెత్తిన ప్రేమగా బోసేరు
రేగి పండ్లను తెచ్చి బాగుగాను
హరిదాసు గీతాలుయానందముండును
బసవన్న సన్నాయి పాట లందు
పల్లె ప్రజలు నెంతొ పరవశ మొందేరు
కొత్త కాంతులతోడను కొలువుదీరు
ఆ.వె
పిండి వంట లెంతొ ప్రీతితో జేసేరు
కోమలాంగు లెంతొ కోర్కె దీర
గడప గడప లందు ఘనమైన శోభతో
పల్లె సీమ లెంతొ పరిఢవిల్లు

కామెంట్‌లు