సునంద భాషితం;-వురిమళ్ల సునంద ఖమ్మం
 కోపం- పెను శాపం
 *******
షడ్గుణాలలో కోపం కూడా ఒకటి.కోపం సహజంగా మనిషిలో ఉదయించే ఉద్వేగం, ఉన్మాదం.
నచ్చని విధంగా ఇతరులు ప్రవర్తించినా, అభిప్రాయాలను విమర్శించినా, వ్యతిరేకించినా మనసులో కలిగే వ్యతిరేకత, అసహనం దానిని ఎదుర్కోవడానికి ఓ రకమైన ఉద్రేకానికి లోనవుతుంది.
అలాంటి వ్యతిరేకానుభూతి వల్ల వ్యక్తిలో ఆవేశం, ఆగ్రహం కట్టలు తెంచుకుని  దూషణలు దాడికి దిగడం లాంటి వికారానికి లోనవుతుంది.
 దాని వలన ఇతరులకు కష్టం నష్టం వాటిల్లడంతో పాటు   తనకూ పెను శాపంగా మారుతుంది. ఆరోగ్యపరమైన, మానసిక పరమైన  ఒత్తిడికి గురై పూడ్చుకోలేని నష్టం జరుగుతుంది.
ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం, దయతో క్షమించడం లాంటివి పాటిస్తూ కోపాన్ని జయించేందుకు ప్రయత్నిద్దాం
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏💐
 


కామెంట్‌లు