సునంద భాషితం;- వురిమళ్ల సునంద ఖమ్మం
 సానుభూతి- సహానుభూతి
*******
సాటి వారిపట్ల అయ్యో పాపం  అని చూపించే జాలి, దయను సానుభూతి అంటారు.
సానుభూతి వ్యక్తం చేయడం వల్ల ఏదో కొంత ఉపశమనం కలుగుతుంది కానీ పూర్తి ప్రయోజనం కలుగదు.
ఎదుటి వారి భావోద్వేగాలను వారి కోణంలో  అర్థం చేసుకునే సామర్థ్యాన్ని,ఆ స్థానంలో మనమే ఉంటే అనే భావన, వారికి మనలాంటి అవసరాలు ఉంటాయనే అవగాహననే సహానుభూతి అంటారు.
 సహానుభూతి అనేది వ్యక్తిత్వానికి శోభను తెచ్చే ఉన్నతమైన లక్షణం.మానవీయ జీవన నైపుణ్యం.
అందుకే తోటివారి బాధలను,కష్టాలను గుర్తించి  సహానుభూతితో సాధ్యమైనంత సాయం చేద్దాం. మనలోని మానవతా హృదయాన్ని చాటుకుందాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు