సునంద భాషితం;- వురిమళ్ల సునంద ఖమ్మం
  క్రౌర్యం-శౌర్యం
******
దయ కనికరం,ప్రేమ లేకుండా నిర్దయగా వ్యవహరించే క్రూర తత్వమే క్రౌర్యం.
సాహసానికి త్యాగానికి ప్రతీక నిలిచే..శక్తి సామర్థ్యాలతో కూడిన వీరత్వమే శౌర్యం
క్రౌర్యం -శౌర్యం  మధ్య అనంతమైన భేదం ఉంది.
ఓ వీధి రౌడీ క్రౌర్యం అరాచకానికి , అకృత్యానికి దారి తీస్తుంది.
అదే ఓ సైనికుడి శౌర్యం దేశ రక్షణకు, ప్రాణ త్యాగానికి సిద్ధపడుతుంది.
ద్వేషం పగల వలన పొడసూపే క్రౌర్య భావనలను మొగ్గలోనే తుంచి వేసి, ప్రతి హృదిలో శౌర్య గుణాన్ని పాదుకొల్పాలి.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు