నాశబోయిన నరసింహ:బదిలీ

 బదిలీపై వెళ్లిన ఆరోగ్య పర్యవేక్షకులు నాశబోయిన నరసింహ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పర్యవేక్షకుడుగా బాధ్యతలు నిర్వహించే కవి, రచయిత నాశబోయిన నరసింహ (నాన)కు స్థానచలనం కలిగింది. ఇక్కడి నుంచి ఆయనను హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి బదిలి చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు ఆయన వేములకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి రిలీవ్ అయి బదిలీపై వెళ్లిపోయారు.1999 సం.నుండి హెల్త్ అసిస్టెంట్ గా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆయన 2009లో ఆరోగ్య పర్యవేక్షకులుగా పదోన్నతి పొంది ఓవైపు వృత్తి పరంగా వైద్య ఆరోగ్య సేవలందిస్తూ, మరో వైపు కవి,రచయితగా తన కవిత్వం ద్వారా సమాజ హితం కాంక్షించే సాహిత్య సేవలు అందించడం ద్వారా అనేక పురస్కారాలు పొందుతూ తన ప్రత్యేకత చాటుకున్నారు.2013 నుండి గత తొమ్మిదేళ్లుగా నరసింహ వేములకొండ ఆరోగ్య కేంద్రంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అమలు పరచడంలో మరియు వేములకొండ ఆరోగ్య కేంద్రం జాతీయ నాణ్యతా ప్రమాణాల స్థాయిలో(ఎన్ క్వాస్, NQAS)గుర్తింపు రావడానికి తన ఉద్యోగ బాధ్యతను సక్రమంగా నిర్వహించారు.ఇటీవల జరిగిన ప్రభుత్వ నూతన జోనల్ విధానం మార్పులో తనను హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం, సికింద్రాబాద్ సబ్ యూనిట్ కార్యాలయానికి బదిలీ చేసినట్టు ఆయన తెలిపారు.

కామెంట్‌లు