సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
  ఆశ-అత్యాశ
******
ఆశ అంతర్గత శక్తినిచ్చే ప్రేరణ. సాధించాలనే తపనను కలిగించే ఉద్దీపన, బతుకును నడిపించే ఇంధనం.కష్టాలను గట్టెక్కించే ఆత్మ విశ్వాసపు ఆలోచనల వారధి.
అత్యాశ శక్తికి మించిన కోరిక. సాధ్యాసాధ్యాలు  ఆలోచించనివ్వని హద్దులు దాటిన ఆశే అత్యాశ.
అత్యాశ .. అక్రమ మార్గంలో కాని పనులు చేసేలా ప్రేరేపించి,హుందాగా ఉన్న వ్యక్తిత్వాన్ని సైతం అధఃపాతాళంలోకి నెట్టేస్తుంది.
అంతర్గత శత్రువై మనశ్శాంతి పోగొట్టి,అరిషడ్వర్గాల సాలెగూడులో బంధీని చేస్తుంది.
అందుకే సద్భావనతో కూడిన ఆశను సంతోషకరమైన జీవితానికి ఆలంబనగా,బాధకు ఔషధంగా ,సంకల్పానికి ప్రాణశక్తిగా స్వీకరిద్దాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు