సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు

 @ లక్ష్యాన్ని ప్రణాళికాబద్ధం చేసుకొని, ప్రణాళికను అమలు పరచుకుంటూ, సాటి మనిషి కొరకు జీవించే వాడిదే నిజమైన జీవితం.
@ విద్యార్థికి గురువు, తల్లిదండ్రులు రెండు కళ్ళు. రెండింటిలో ఏది సరిగాలేకపోయినా జీవితం అంధకారమవుతుంది.  వివేకానంద
@ వ్యక్తిగా ఆవిష్కృతమయ్యేందుకు నీకున్న జన్మహక్కును నిల్పుకున్నప్పుడే జీవితం అనే ఆటలో నువ్వు గెలవగలవు. అబ్దుల్ కలాం
@ శాశ్వతత్వం  అనే పుస్తకానికి అంద ముందుమాట జీవితం. జూలీ జర్నీ ఎలియనోర్
@ సంఘర్షణ లేని జీవితం నిరర్థకం.
@ సంస్కారం లేని జీవితం మృతప్రాయ జీవితంతో సమానం.
@ సాధారణ జీవితం, ఉన్నత భావాలు గల మనిషి ఉత్తముడు.  వర్డ్స్ వర్త్
@ సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు, తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్ధించు. బ్రూస్ లీ
@ సోమరితనం మృత్యువు, క్రియాశీలతే జీవితం. స్వామి రామతీర్థ

కామెంట్‌లు