అద్భుతాల శీతాకాలం ;-పురం మంగ;-కలంస్నేహం
 శీతాకాలపు ప్రాతఃకాల సోయగం
కనువిందు చేయును ప్రతినిత్యం
మంచు వస్త్రంలో కురిసే హేమంతం
పచ్చ పచ్చని తివాచీపై
మంచు పూల వానలు
పుడమి తల్లి ఎడద పై
ముత్యాల అలంకారం
ప్రకృతి దృశ్యమాలికి నయన మనోహరం
అంబరంలో అంశుమాలి ఆగమనం
చలిగిలిగింతలకి తాళలేని ప్రాణికోటి నిరీక్షణా పర్వం
నిశ్శబ్ధం రాజ్యమేలుచుండగ
వీడ్కోలు పలుకు కోడిపుంజుల కొక్కొరొకోల ఉదయగానం
మనసు మయూరమై నర్తించగా
పల్లె సిగలో కనువిందు చేయు
ఆహ్లాదకర వాతావరణం
ప్రతి ఉదయం తుషార తుంపరలే
బాలభానుని అరుణకిరణం
పులకింప చేయును మేని సెగల వేడిని
హిమపాతం శరాఘాతమై తగలగ
సతమతమవుతున్న పుడమిని
గజగజ వణుకుల మనుజునులను
వెచ్చని ఆలింగనల స్వాంతన శోభితం
శీతాకాలపు అందాలను
ఏమని పొగడను ఆ
మంచుపూల గుబాళింపు ను
మనసు పరశమై
మేని మయూరమై
నులివెచ్చని కిరణాలకై
తహతహలాడును పులకాంకురమై
తల్లి శీతికాలపు చిలిపి తనంలో
రవి కాంతిలో మంచు మెరిసిపోతుంది
మలుపులు వెలిగి
మంత్ర ముగ్ధమైన అడవి పాట పాడగ
ప్రకృతి నిశ్శబ్దం లో ప్రశాంత స్వచ్ఛత
ఎంత‌అద్భుతమైన 
ఆనందకరమైన
శీతైకాలమో కదా.....!

కామెంట్‌లు