సంక్రాంతి సంబరాలు;-డా. కమలా దేవి;-కలంసస్నేహం
 వచ్చింది సంక్రాంతి సండుగ
సంబరాలపండుగ
అందరిఇంటి తోరణాలు వారి
వారి గృహశోభలకుకారణాలే  కదా
సంక్రాంతి లక్ష్మి ఆగమనాన్ని
ఆకాంక్షిస్తున్నారు ఆగమ మంత్రాలతో
సంక్రాంతి లక్ష్మి శ్రీకరము సర్వశుభములకు ఆకరము
వారిస్తుతుల రవళులతొ
ఆశ లన్నీ'ప్రతిధ్వనిస్తూ   పెంచుతున్నాయిమానవాళి
ఆశలను
సంక్రాంతి లక్ష్మి, సస్యలక్ష్మి
పదహారు కళలతో కళకళలాడుతోంది
జగతి యొక్క గతులనే మార్చు సంస్కృతీ సంప్రదాయాల   పండుగ మకరసంక్రాంతి
పలు పాదాలలో  నుతిస్తున్నారు ఆ లక్ష్మీదేవిని
అనురాగం తోమోహనరాగం లొ 
గంగిరెద్దుల పండుగ, గాలిపటాల పండుగ
గగనవీథిన ఎగురు ఆగాలిపటాలను లెక్కింప గగనమే
పాలు పంచుకుంటున్నారు ఆపాయసాన్నమున వేయు ఆవు పాలలో
హారతులందిస్తున్నారు ఆరతీదేవిసమానసౌందర్యంగల ఆపడతులు
క్షయములేని, క్షయముకాని
అక్షయపాత్రలవి
పలువిధముల సంగీత సాంస్కృతిక కార్యక్రమాల సందడి
బొమ్మలకొలువుకి విచ్చేసిన
ముదితలలొ
వీణ వీణవాయించగా,
శ్రుతి శ్రుతిని సరిచేస్తోంది
లయ లయబద్ధంగా నాట్యం చేస్తోంది
కన్నులపండువుగా ఉన్నాయి
ఆసంక్రాంతి వేడుకలు
అజ్ఞానతిమిరాలను తొలగించే
కాంతులను వెదజల్లే పండుగే
సంక్రాంతి.

కామెంట్‌లు