సీ.మా*వేకువజామున వెలదులందరుగూడి
చక్కగావాకిళ్ళ సాన్పిజల్లి
ముత్యాలముగ్గులు ముంగిళ్ళనిండుగా
రంగులన్నియువేసి రతనమటుల
పల్లీలునువ్వులు పట్టీలుగాజేసి
ఉండలుగాకొన్ని వండుకొనుచు
అరిసెలు బూరెలు నంగురాలునుకొన్ని
సకినాలు మురికీలు చాలజేసి
నట్టింట పాలను ,ముట్టించి మంటను
పదమూడు పదమూడు పంచుచు నోములు
వాయనమ్మునునిచ్చి వాంఛదీర
తే.గీ*పూజలన్నియుజేసియు పుణ్యవతులు
నింట కాంతులు నిండగా,పంటపండ
నిండు ముత్తైదువులకిల నండ యనుచు
కోర సంక్రాంతి లక్ష్మియు కోర్కెదీర్చు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి