అందమైన ప్రేమ కథ;-వాణి రమణ;-కలం స్నేహం
 పల్లవి
ఆమె
ప్రియతమా ఓ ప్రియతమా... 
నీ ధ్యాసలో నన్ను నే మరచిపోయాను 
నీ ధ్యానములో నన్ను నే.. తెలుకున్నాను... 
ఓ ప్రేమ
కలల  ప్రేమలేఖ రాసాను
కవితగా నీ ముందు నిలిపాను
ప్రియతమా నా ప్రేమనే స్వీకరించుమా
కళ్ళలో నీ రూపమే అపురూపమై
నన్నల్లుకున్నావు
గుండె గుడిలో దైవమై నిలిచావు
అతడు
ఓ ప్రియ   నా హృదయములో
పచ్చ బొట్టల్లె
నిలిచావులే
నా చిరునవ్వులో అందమై మెరిసావులే 
చరణం. 1
అతడు
సింగిడిలోని రంగులన్నీ నేలకే 
దిగి వచ్చి నీ రూపమై నా ఎదుటే 
నిలిచేనా 
బొమ్మరిల్లులోని బుట్టబొమ్మ లే
నీ సౌదర్యమే నా ముంగిట్లో 
వాలేనా.. 
నీ జ్ఞాపకమే ఊపిరిగా జీవిస్తున్నా
నీ లేఖలనే దుప్పటిగా చేసుకున్నా
ఆమె
వయసులో మనసులో ముడిపడిన
అనురాగపు బంధమో మరపురాని స్నేహ బంధమా 
అతడు
మొదటి సారిగా చూసే చూపుల 
మాయనే మనసునే హత్తుకున్నదే
చరణం 2
నీ నవ్వులే సంగీతమల్లే జోలలే 
పాడి నిదుర పుచ్చేనా
ఆమె 
నీ దరహాసమే పూల జల్లులే 
కురిపించేను 
పన్నీటి రాగాలనే కురిపించేను

కామెంట్‌లు