నరేంద్ర పదకొండేళ్ల బాలుడు. నాయకత్వం ఆ బాలుడి సహజ లక్షణం. కనుక అతను తన ఈడు పిల్లలకు ఎల్లప్పుడూ నాయకుడిగా వ్యవహరించేవాడు.
ఓమారు కలకత్తాకు ఓ యుద్ధనౌక వచ్చింది. ఆ నౌకను నరేంద్ర, అతని స్నేహితులు చూడాలనుకున్నారు.
నరేంద్ర ఆరా తీస్తే తెలిసిందేమిటంటే ఆ యుద్ధ నౌకను చూడాలంటే ఓ ఆంగ్లేయ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని!
దాంతో నరేంద్ర ఓ ఉత్తరం రాసుకుని ఆంగ్లేయ అధికారిని కలవడానికి వెళ్లాడు. ఆ అధికారి కార్యాలయం ఒక భవనం పై అంతస్తులో ఉండేది. ఆయన్ను కలవాలంటే మెట్లు ఎక్కాల్సిందే.
ఆ మెట్ల దగ్గరున్న సెక్యూరిటీ గార్డు పంపితేనే ఎవరైనాసరే మెట్లెక్కి అధికారిని కలవగలరు.
నరేంద్ర ఆ సెక్యూరిటీ గార్డు దగ్గరకు వెళ్ళి, "నేను, నా స్నేహితులు యుద్ధనౌకను చూడాలనుకుంటున్నాం. పైనున్న అధికారిని కలిసి అనుమతి పత్రం తీసుకోవడానికి వచ్చాను" అని చెప్పాడు.
కానీ ఆ సెక్యూరిటీ గార్డు నరేంద్రను బాలుడవడంతో పైకి వెళ్ళేందుకు అనుమతించలేదు.
అప్పుడు ఏమి చెయ్యాలా అనుకున్న నరేంద్ర మేడమీద ఉన్న అధికారిని కలవడానికి మరేదైనా మార్గం ఉందాని భవనం చుట్టూ తిరిగాడు.
అయితే భవనం వెనుక ఎవరికీ అంత సులభంగా కనిపించని ఓ సన్నని మెట్ల మార్గం కనిపించింది.
నరేంద్ర అందులో నించి పైకి వెళ్ళి బ్రిటీష్ అధికారిని కలుసుకుని తన అభ్యర్థనను వినిపించాడు.
నరేంద్ర అనుకున్నది ఫలించింది. నరేంద్ర, అతని మిత్రబృందం ఆ యుద్ధనౌకను సందర్శించడానికి సంబంధిత అధికారి అనుమతి ఇచ్చారు.
అనంతరం, నరేంద్ర మొట్టమొదట ఏ సెక్యూరిటీ గార్డు ఆపాడో ఆ మెట్ల గుండా కిందకు దిగి వచ్చాడు.
నరేంద్రను చూసిన ఆ సెక్యూరిటీ గార్డు "ఎలా పైకి వెళ్ళావు?" అని ఆశ్చర్యంగా అడిగాడు.
అప్పుడు నరేంద్ర, "నేను మంత్రగాడిని!" అని నవ్వుతూ బదులిచ్చాడు.
ఈ నరేంద్రుడెవరో కాదు, తర్వాతి కాలంలో స్వామి వివేకానందగా మారారు.
ప్రపంచంలోని అనేక దేశాలను సందర్శించి భారతదేశ గొప్పతనాన్ని చాటారు. అనంతమైన శక్తికి, జ్ఞానానికి పెట్టింది పేరైన స్వామి వివేకానంద ఏదన్నా అనుకుంటే ఆ పనిని ఆరు నూరైనా పూర్తి చేసేవారనడానికి ఈ చిన్ననాటి సంఘటన ఓ ఉదాహరణ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి