సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 మాట ఇవ్వడం
*******
మాట సాయమో,చేత సాయమో చేస్తామని అనే ముందు  చేయగలమా లేదా అని బాగా ఆలోచించిన  మీదటే మాట ఇవ్వాలి.తొందరపడకూడదు.
ఇచ్చిన తర్వాత వాయిదా వేయడమో, తప్పించుకునేందుకో ప్రయత్నించకుండా వాటిని నెరవేర్చడానికి త్వరపడాలి. అప్పుడే నమ్మకమైన నిఖార్సయిన వ్యక్తులుగా సమాజంలో గుర్తింపు, అభిమానం పొందగలం.
అందుకే ఆరునూరైనా నూరు ఆరైనా, మిన్ను విరిగి మీద పడ్డా మాట తప్పని మానధనులుగా మహనీయులు,మాననీయుల సరసన నిలుద్దాం.
 మాట ఇచ్చి నెరవేర్చడంలో ఉన్న గొప్పతనాన్ని, భావి తరాలకు తెలియజేద్దాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు