సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 
ఫలితం ఉన్నా లేకున్నా...
*******
చేసే ప్రతి పనికి వెంటనే ఫలితం రాదు, రాలేదు.కొంతైనా సమయం పడుతుంది.
అలాగని చేయాల్సిన మంచి పనులు ఆపివేయకూడదు.
మొక్కయినా విత్తనమైనా నాటగానే వెంటనే మనకు కావాల్సినవి ఇవ్వలేదు కదా.
అందుకే...  వెంటనే ఫలితం ఉన్నా లేకున్నా, రాకున్నా ఎంతో ఇష్టంగా కష్టమనుకోకుండా మంచిపనులను చేస్తూనే ఉండాలి.
 అవి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా గుర్తింపుకు నోచుకుంటాయి.ఏనాటికైనా ఎదుటి వారి హృదయాన్ని తాకి ఆలోచింపచేస్తాయి. మంచి పనుల గొప్ప తనాన్ని గ్రహించి గౌరవించేలా చేస్తాయి.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు