61. “చిన్నారి పసికందుల ....” చిన్నారి పసికందుల కన్నుల స్పృశించే నిద్రకు పుట్టుక స్థానమేదో అది ఏ వైపు నుంచి వస్తుందో ఎవ్వరూ తెలియలేరు కదా... దీనికో కట్టుకథ వుంది, మిణుగుడు పురుగుల మసక మిలమిలల అరణ్య నీడలమధ్య నిద్రను తీసుకొచ్చే మాయామోహపు పూలమొగ్గలు రెండున్నవట. పసికందుల కళ్ళను ముద్దుగా తాకేందుకని అక్కడినుంచి నిద్ర బయలుదేరి వస్తుందట. నిద్రించే పసిబిడ్డ లేత పెదవుల మీద వచ్చీ రానట్లు దాగుడుమూతలు ఆడే చిరునవ్వుకు పుట్టుక స్థానం ఎవరికైనా తెలుసా? దీనికి కూడా మరో వదంతి వాడుకలో వుంది. చవితినాటి చంద్రకిరణ మొకటి జారి కరిగి పోబోతున్న వసంత మేఘశకలాన్ని తాకిందట. ఆ ఉదయ శీతల హిమపాత వేళయే నిద్రించే పసికందు పెదవులపై చిరునవ్వుకు తొలిజననమని చెప్తారు. పసికందు లేత శరీరంమీద మిలమిలా మెరిసే మృదుమధుర కోమలకాంతి ఇంతకాలం ఎక్కడ దాగివుందో తెలుసా? ఆ పాప తల్లి బాల్యదశలోని అమాయక, అవ్యక్త హృదయాన్ని పాదుగా చేసుకొని పసికందు లేతశరీర నవనీత మృధుమధుర కోమల కాంతి నిద్రావస్థలో వుంటుంది.
గీతాంజలి ;--రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి