.సావిత్రి భాయి పూలే;-యం.టి.స్వర్ణలత;-కలం స్నేహం
ఆమె ఒక చైతన్యఝరి...
పేదల హృదయాలలో నిండిన కౌముది
స్త్రీలకు విద్యనందించుట ధర్మవిరుద్దమనే
చాందస బ్రాహ్మణ వంశాలున్న నాట పుట్టినా
విజ్ఞాన వీచికలతో ఆత్మస్థైర్యం నింపేటి మేటి
చదువూ సంస్కారాలను ప్రజలలో నాటి
అంటరాని జీవితాలలో వెలుగుపూలు
విరబూయించాలని వెలిగిన జ్యోతి

భర్త అడుగుజాడల్లో నడుస్తూ...
అవమానాలను అవహేళనలను లెక్కించక
ఎన్నో సంస్కరణలకు తెరతీసిన ధీశాలి
మొదటి మహిళా ఉపాధ్యాయురాలు 
పరమసాధ్వి సావిత్రి బాయిపూలే

బడుగు బలహీన వర్గాల బాలికలను
ప్రోత్సహించి పాఠశాలలను నిర్మించి
తిండి సైతం లేని పేదవిద్యార్థులకై
మధ్యాహ్న భోజనాలు సమకూర్చి
పాఠశాలలనే వసతీ గృహాలుగా చేసి
జీవితాన్ని బడుగులకు అంకితమిచ్చి
భావి తరాలకు మార్గదర్శనమై నిలిచి
స్త్రీల జీవితాలను మార్చిన మహిళా శక్తి


కామెంట్‌లు