అంశ— పదెం;- సత్యవాణి

 కుం: పందెము గాయవె నాతోడ
పరుగున గెలుతును నేననచు
తా: నడవగ కష్టము నాకౌను
పందెము ఎట్టుల కాయుదును
కుం:పంతము పట్టుము తాబేలా
ఫలితమందును నీకపుడు
తా:అయితే సరిలే కుందేలా
అటులే పందెముగాయుదును
ఒకటి రెండు మూడనుచు
ఒక్కమారుగ పరుగారంభించెనవి
దుముకుచు గెంతుచు కుందేలు
దూరముచాలా పరుగిడెను
అలసట కలిగిన కుందేలు
హాయిగ నిద్రనుబడిపోయె
బుడి బుడి నడకల తాబేలు                   
బుధ్ధిగ గమ్యంచేరినది
మెలకువగలిగిన కుందేలు
మెల్లిగ గమ్యంచేరినది
మిత్రుడు కమఠము నచటగని
ముసిముసినవ్వులు నవ్వెనది
కుం: ప్రయత్నమంటూ చేసామా
^^^ఫలితంతప్పక అందునులే
^^^నీలో స్థైర్యము పెంచుటకే
పందెము అంటిని తాబేలా
ఓటమి ఒప్పకు ఏనాడూ
మెప్పులునందుము స్నేహితుడా
సంతసమందుచు కూర్మంబు
మిత్రుని హత్తెను హృదయాన
        
కామెంట్‌లు