శుక్రరథం. పురాణ బేతాళకథ.;-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు., చెన్నై

 పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని బంధించి భుజంపై వేసుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు 'మహారాజా అయోధ్య,మధుర,మాయా,కాశీ,కంచీ,అవంతిక,ద్వారావతి వంటి సప్త పుణ్యనగరాలను సందర్శించిన నీవు అభినందనీయుడవే! నాకు చాలాకాలంగా శ్రీకృష్ణుని వద్దనున్న శుక్రరధం ఎలా వచ్చింది అన్నది తెలుసుకోవాలని ఉంది. తెలిసి చెప్పక పోయావో మరణిస్తావు ' అన్నాడు.
' బేతాళా వైవస్వతమనువు కుమార్తె 'ఇల'ఈమె చంద్రుని కుమారుడు అయిన 'బుధుని' వివాహంచేసుకుంది.వీరి కుమారులలో ఒకరైన 'పురూరవుడు' గొప్పశివభక్తుడు. యమునానది తీరంలో ప్రయాగ క్షేత్రమునకు సమీపములోని 'ప్రతిష్టానపురం'రాజధానిగా చేసుకుని, పరిపాలన చేస్తుండేవాడు.
ఇతను మంచి రూపంఉన్న పరాక్రమవంతుడు కావడంతో ఆయన కీర్తి దేవలోకానికి కూడా పాకింది. ఇంద్రుడు అవరసమైతే అప్పుడప్పుడు పురూరవుని సహాయం కోరేవాడు. ఒకసారి ఇంద్రుడు ఆయనను అమరావతికి ఆహ్వానించాడు. పురూరవుడు తిరిగి తన రాజ్యానికి వెళుతుండగా కొంతమంది అప్సరసలు వచ్చి ఊర్వశిని కేశి అనే రాక్షసుడు అపహరించారని చెబుతారు. అప్పుడు పురూరవుడు ఆ రాక్షసుని వెంబడించి ఊర్వశి ఆ చెర నుండి విడిపిస్తాడు. ఆ సమయంలో వారిరువురూ ఒకరికొకరు ఆకర్షితులవుతారు.
రాజ్యానికి వచ్చిన పురూరవునికి ఆమె తలపులలో మునిగిపోయి కర్తవ్యాన్ని కూడా సరిగా నిర్వర్తించలేకుంటాడు. మరో వైపు ఊర్వశి కూడా అతన్ని విడిచి ఉండలేకుండా ఉంటుంది. చివరికి ఇంద్రుని అనుమతితో అతన్ని వివాహం చేసుకుంటుంది. ఆ వివాహానికి ఇంద్రుడు కూడా వెళ్ళి వారిని ఆశీర్వదించి, మరలా ఎప్పుడైనా సహాయం అవసరం అయితే చేయాలని పురూరవుని దగ్గర మాట తీసుకుని వస్తాడు. ఆ తరువాత తన రాజ్యాన్ని బాగా విస్తరిస్తాడు.
పురూరవుడికి ఊర్వశి ద్వారా ఆరు మంది సంతానం కలుగుతుంది. వారు ఆయు, అమావసు, ధిమన, విశ్వాయు, ధృధాయు, శృతాయు.
మరణం ఒకసారి పురూరవుడు నైమిశారణ్యానికి వేటకి వెళతాడు. అక్కడ కొంతమందియోగులుయజ్ఞంచేస్తూఉంటారు.వారుచేతిలో బంగారు పాత్రలు ఉంటాయి. పురూరవుడు ఆ బంగారు పాత్రల్ని చూసి అవి క్షత్రియుల చేతిలోనే ఉండాలనీ సాధువుల చేతిలో అలాంటివి అంతగా బాగుండవని అంటాడు. ఆ మాటలకు సాధువులు నొచ్చుకుంటారు. అంతే కాకుండా సాధువులకు బంగారంపై ఆశ ఎందుకనీ ఆ పాత్రల్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఆ సాధవులకు కోపం వచ్చి మండుతున్న కట్టెలను వారిపై విసిరేస్తారు. ఊహించని ఈ పరిణామం నుండి తేరుకునే లోపే పురూరవుడు అతని సేవకులు మరణిస్తారు. . 
ఇతని కుమారుడు అయిన ఆయువు భార్యప్రభాదేవి.ఈమె' సర్బావుని' కుమార్తె.వీరికి' నహుషుడు' జన్మించాడు. నహుషుడు పిత్రుదేవతల కుమార్తె 'విరజ' నువివాహంఆడాడు.వీరికి యతి,యయాతి, సంయాతి, ఆయాతి, అంధకుడు,విజాతి అనే కుమారులు జన్మించారు.యతి తపోవనాలకు వెళ్ళగా,యయాతి రాజ్యభారం వహించాడు.యయాతికి రాక్షసల గురువైన శుక్రాచార్యుల కుమార్తె'దేవయాని'-వృషపర్వుడు అనే రాక్షస రాజు కుమార్తె'శర్మిష్ఠ' అనే ఇద్దరుభార్యలు.దేవయానికి'యదువు'(యదువంశంమూలపురుషుడు)'తుర్వసుడు'జన్మించారు.శర్మిష్ఠకు 'ద్రుహ్యుడు' 'అనువు' 'పుపురువు'అనే కుమారులు జన్మించారు. శుక్రుడు యయాతికి'శుక్రరధం'అని తనపేరిట ఒక శక్తివంతమైన బంగారు రథాన్ని,'అక్షయమగు అమ్ములపొది' (ఎన్నిబాణాలు వాడినా ఎప్పుడూ నిండుగా ఉండేది)నిర్మించి ఇచ్చాడు.అలా యయాతి కి అందిన ఆరధం,అనంతరం కౌరవులవారసత్వంగా వచ్చింది. అలా పరిక్షిత్తు నికుమారుడైన 'జనమేజేయుడు' 'గర్గముని'కుమారుని చంపడంవలన బ్రహ్మహత్యాపాతకానికి లోనై 'శౌనక' ముని ద్వారా అశ్వమేధ యాగంచేసి బ్రహ్మహత్యా పాతకంనుండి బైటపడ్డాడు.శుక్రరధం ఇంద్రుని వద్దచేరింది. ఇంద్రుడు ఆరధాన్ని 'వసువు'కు ఇచ్చాడు. ఆరధం. అనంతరం 'బృహద్రథుడు' (జరాసంధుని) వద్దకు చేరింది.జరాసంధుని సంహరించిన 'భీముడు'ఆరధాన్ని శ్రీకృష్ణునికి కానుకగా ఇచ్చాడు.ఆశుక్రరధానికి శ్రీకృష్ణుడు దారకుని రధసారధిగా చేసుకున్నాడు 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడంతో శవంతో సహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టుపైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.

కామెంట్‌లు