కవిత్వం రాసే వారు కనీసం ఒక్కసారైనా సీతాకోక చిలుకల అందాలను వర్ణిస్తూ కవిత్వం రాసే ఉంటారు. అటువంటి సీతాకోకచిలుకల గురించి ఒకటి రెండు విషయాలు ......
ఒకే చోట అనేక రంగులను చూడాలను కుంటే, మీరు సీతాకోక చిలుకలను చూడాలి. అడవిలోకి సీతాకోకచిలుకలు రావడం, అవి ఎక్కువగా ఉంటే ఆ ప్రదేశం సారవంతమైనదని అర్థం.
పువ్వులకు సువాసన ఇవ్వడానికి తేనెను తీసుకుంటూ జీవించేవి సీతాకోకచిలుకలు. వీటి అందం చూస్తున్న కొద్దీ ముచ్చటేస్తుంది. ఇవి రెక్కలాడిస్తూ అటూ ఇటూ ఎగురుతూ మన కళ్లతో ఆడుకోగలవు.
గుడ్డు నుండి ఇవి తొలుత ఒక పురుగుగా మారుతాయి. అప్పుడవి లార్వా స్థితికి వెళ్లి, తక్కువ సమయంలోనే అందమైన సీతాకోకచిలుకగా ఈ ప్రపంచంలోకి వస్తాయి. ఇవి సాధారణంగా విషపూరితమైన మొక్కలపై గుడ్లు పెడతాయి.
సీతాకోకచిలుకలలో అతిపెద్దవి పపువా న్యూ గినియాలో నివసిస్తాయి. వాటిని క్వీన్ అలెగ్జాండ్రా అంటారు. వీటి రెక్కలపొడవు 28 సెంటీమీటర్లు.
అమెరికాలో నివసించే వెస్ట్రన్ నేవీ బ్లూ అతి చిన్న సీతాకోకచిలుక. దీని రెక్కల పొడవు ఒక సెంటీమీటర్.
వలస సీతాకోకచిలుకలు ఆశ్చర్యకరమైనవి. ఇవి రోజుకు 3000 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తాయి.
సీతాకోకచిలుకలన్నీ ఒకేలా ఉండవు. వాటి మధ్య తేడాలు ఉంటాయి. నిజానికి మనం చూసేవన్నీ సీతాకోకచిలుకలు కావు.
కొన్ని సీతాకోకచిలుకలు రెక్కలపై ఇంద్రధనస్సు రంగులు చూడవచ్చు. అవి రెక్కలు చాచి ఎగురుతుంటే వాటిని చూడడానికి రెండు కళ్లు చాలవు.
చాలా సీతాకోకచిలుకలు రాత్రిపూట తిరుగుతాయని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వాటిని నైట్ గుడ్లగూబలు అని కూడా అంటారు. ఇవి కూర్చున్నప్పుడు తమ రెక్కలను అడ్డంగా విస్తరించి, ఎగురుతున్నప్పుడు వెనుక రెక్కలను పట్టుకునే హుక్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి.
తమిళనాడులోని పర్వత వాతావరణంలో 324 రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. పర్యావరణంలో గొప్పగా సహాయపడే సీతాకోకచిలుకలు, మొక్కల మధ్య పరిమాణాన్ని కలుపుతాయి. అవి మొక్కల పరాగసంపర్కానికి గొప్ప సహాయం కాబట్టి, దట్టమైన అడవిని సృష్టించే పర్యావరణ కారకాలు.
అయితే ఆవాసాల విధ్వంసం, మితిమీరిన పురుగుమందుల వినియోగం, మనుషుల చర్యలు వంటి పలు సమస్యల కారణంగా కొంతకాలంగా సీతాకోక చిలుకల సంఖ్య తగ్గిపోతుండటం విచారకరం.
ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎక్కువ వేడిగా ఉంటుందో గుర్తించే సామర్థ్యం వీటికుండటం విశేషం.
వన్యప్రాణులను రక్షించడం మాత్రమే మన కర్తవ్యం కాదు, సీతాకోకచిలుకల వంటి చిన్న జాతులను రక్షించడం కూడా మన బాధ్యత.
సీతాకోకచిలుకా,
రంగు రంగుల కోకలను ధరించి
రెక్కలాడిస్తూ ఎగిరే సింగారానివి నువ్వు....
నీ రంగులను చూసి
పరవశించని వారుంటారా
నిన్నూహించుకుని
కుంచెల నించి పుట్టే
సీతాకోకచిలుకలెన్నో
ఊహకందని
రంగుల సమ్మేళనానివి
మృదువైన అందమైన
నీ రూపం చూసి
నిన్ను పట్టుకోవడానికి
చిన్నతనంలో
మద్రాసు పనగల్ పార్కులో
మొక్కల మధ్య
పరుగులు తీసిన రోజులెలా
మరవగలను
పువ్వులమీద
నువ్వు వాలి చెప్పే
రహస్యాలేమిటో
వినాలనే ఆశ
అప్పుడే కాదు
ఇప్పటికీ తీరలేదు
నీ ఆయువు
స్వల్పమే అయినా
ఉన్నన్ని రోజులూ
చూసే కళ్ళకు నువ్విచ్చే
ఆనందం అపరిమితం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి