మల్లుస్వరాజ్యంగారికి అశ్రునివాళి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
సాయుధపోరాటములో
న్యాయముకొరకైనిలబడెనారీమణియున్
ధ్యేయమువిడువకనైజాం
దాయాదులదుమ్ముదులిపెధైర్యమువిడకన్!!!

02.
సీసమాలిక.
"మల్లుస్వరాజ్యమువెల్లువగాజన"
"సేవలుసలిపియుత్రోవజూపి" 
ఆరజాకారులఆటలుకట్టించి
పోరుసాగించినధీరవనిత
నైజాముప్రభువుకునాల్గుచెర్వులనీళ్లు
త్రాగింపజేసినధైర్యశాలి
బడుగులభ్యున్నతిబాసటైనిల్చియు 
స్ఫూర్తినినింపినసుగుణశీలి
మద్యపాననిషేధయుద్యమంబునుజేసి
ప్రజలహక్కులకయిపాటుపడియె
"నాగొంతెనాతుపాకీతూట"
అనినినదించినఅగ్గిపిడుగు
(తే.గీ.)
చేతితోతుపాకినిబట్టిచేవతోడ
మనతెలంగాణసమరముఘనతచాటి
వీరనారిగాపేరొందివిప్లవించి
చిరయశస్సునుపొందెనుధరణిపైన!!!


కామెంట్‌లు