"ప్రపంచమూత్రపిండాల(కిడ్నీ)దినోత్సవం-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
తే.గీ.

జీవిమనుగడకివిగాదెస్థావరములు
రక్తమునమలినములనుశక్తితోడ
శుభ్రపరచుచుపనిజేయునభ్రముగను
రక్తపోటునియంత్రించిరక్షజేయు!!!

02.
తే.గీ.
మానవునికిముఖ్యంబుగామసలుచుండి
అవయవమ్ముగానారోగ్యమందజేసి
నెత్తురునుప్రతిరోజునుసత్తువగను
శుద్ధిగావడకట్టునుబుద్ధితోడ!!!

03.
తే.గీ.
వృక్కధర్మమ్మునెరవేర్చివృద్ధినొసగి
చిక్కుడిత్తురూపములోనజీవియందు
నుండి,మూత్రపిండాలవియోర్పుమీర
దేహమందునకొలువుండితేజరిల్లు!!!
కామెంట్‌లు