రంగులు
రంగవల్లులై పూస్తే సంక్రాంతి
రంగులు
ఇంద్రజల్లులై కురిస్తే రంగోలీ
వసంతం లా
వర్షించే ప్రేమ
హసంతమై వర్షించిన రోజు ఇది...!
వేణు గీతికలా
ప్రవహించిన
ప్రణయరసం
సుఖ చందనమై దిద్దిన రోజు ఇది...!
రస కృష్ణునితో
బృందావనాన డోలికలూగిన
విరహ వీచికా తపస్వినులైన
గోపికలు పరమానందం పొందిన రోజు ఇది...!
త్రినేత్రుని శక్తికి
రతీ వల్లభుడు దహనమైన రోజు ఇది...!
ప్రహ్లాదుని భక్తికి
హోలికా రక్కసి చితికి చేరిన రోజు ఇది...!
ఇదో రసకేళి
ఇదో ఆనంద హేళి..రంగోలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి