సమస్యాపూరణలు;-మమత ఐలకరీంనగర్9247593432
 *తలఖండింపగ రండహో కవివరుల్ ధర్మంబు కాపాడగా*
మ.
పలుకుల్ భూషణశోభగూర్చుననెడీ పాఠంబు లేవిన్నగన్
సులువౌ కుంచిత బుద్ధినన్ మునిగిరే! చోద్యంబులన్ గానకన్
ఫలముల్దక్కగ నోర్వలేననియె డాపద్బాంధవుల్జెప్పు కో
*తల ఖండింపగ రండహో కవివరుల్ ధర్మంబు కాపాడగా*
 సమస్యాపూరణం
*కుటిలాలక యెడమకన్ను కుడికన్నాయెన్*
క.
పటపట వండెడి వంటన
చిటపటమని కూరపోపు  చిల్లగ కంటన్
తృటిలో యాకనుమూయగ
*కుటిలాలక యెడమ కన్ను కుడికన్నాయెన్*

కామెంట్‌లు