రావమ్మ రావమ్మ పిచ్చుకమ్మా
రావమ్మ మా యింటికి
చిన్నగా బొద్దుగా వుండేవు
చిన్న తోకతో పొట్టిగా వుంటావు
గట్టి ముక్కు కలిగి వుంటావు
గలగలా తిరుగుతుంటావు
//రావమ్మ రావమ్మ //
ఊదా గోధుమ రంగుల్లో అందంగా వుండి నీవు
కిచకిచ శబ్దాలతో
ఊరంతా సందడి చేస్తావు
// రావమ్మ రావమ్మ //
తుఱ్ఱున ఎగిరిపోయేవు
ఎక్కడెక్కడో తిరిగేవు
తిండి గింజలెన్నో తెచ్చేవు
పిల్లల కడుపు నింపేవు
// రావమ్మ రావమ్మ //
కానికాలమొచ్చిందమ్మా
రసాయన మందులు చల్లిన
పంట గింజలు తినకమ్మా
ప్రాణానికే ప్రమాదమమ్మా
// రావమ్మ రావమ్మ//
సెల్యులర్టవర్ల అయస్కాంత తరంగాలు మీ జాతి అంతానికి
అవుతున్నవి బ్రహ్మాస్త్రాలు
జాగ్రత్త జాగ్రత్త పిచ్చుకమ్మా
// రావమ్మ రావమ్మ//
కిచకిచ రావాలతో మమ్ము
అలరించే ఓ పిచ్చుకమ్మా
నిను కాపాడుకోవడం మా అందరి కర్తవ్యమమ్మా
// రావమ్మ రావమ్మ//
నీ ఆకలి తీర్చే తిండి గింజలు
నీ దాహం తీర్చే నీటి తొట్టెలు
నీ కోసం అందాల గూళ్ళు
మా యింట సిద్ధం సిద్ధం
// రావమ్మ రావమ్మ //
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి