ఈ రోజు
సాధారణ రోజేమీ కాదు
అరుదైనదీ అద్భుతమైనది కూడా
మూడు ప్రపంచ దినోత్సవాలూ
ముప్పేటలా అల్లుకున్నవి
ముప్పిరిగొన్న
మోట బొక్కెనకు కట్టిన దండెడలా
ఆలోచనానందాలాడే డెందాలన్నీ
ఒకేరోజు ఇన్ని పండుగలొస్తే
మనసు ఆడెను పరవళ్ళ నురుగుల నాట్యమై
అవని పాడెను మనిషిలో చిగురుల బాల్యమై
1.
ఒక అక్షరం
నేలంతా దున్నిన కవితైంది నేడు
ప్రపంచం కన్న కలల
విహ్వల నేత్రాల దృశ్యపు నీడలు
ఒక చీకటిలోంచి ప్రవహించే వెన్నెల
ఓ వేకువలోనే స్రవించే తిమిర వేదన
అతలాకుతలమైన మట్టిలో
పట్టి కుదిపేదే ఔషధ కవిత్వం
పూలతోట శవాల బాటగా మారినా
గడ్డి మైదానంలో ఊపిరి ఎగిసింది
బతుకులో ప్రతీరోజూ పూస్తుంది
కానీ ప్రతి పూసే పూవూ
వైవిధ్యం రంగూ వాసనల్లో
భావోద్వేగాలతో నిండిన కవిత్వంలో
లయల అలలు ఈదే హృదయం సంద్రమైంది
ప్రపంచం కవితా దినోత్సవమై నేడు
2.
అమూల్యమైంది అడవి
మూడొంతులపైన ప్రపంచ భూమి
ప్రాణమైంది జీవులకు అడవిగా
వృక్షజాలం జంతుజాలం జలజాలం
జీవాధారంలో మనిషి మనుగడుంది
స్వేచ్ఛలోని గాలీ,బతుకులో ఊపిరి
తేట తేట యేరూ,స్వచ్ఛమైన నీరూ
ప్రాణాధారమై పారేవన్నీ అడవి ఆత్మే
అడవంటే నిశ్శబ్దం కాదు
సకల ప్రకృతి ధర్మాల జీవన లోగిలి
హరిత లతల నింగి శబ్దనిలయం అడవి
నేడు స్వప్నించే వృక్షజాల ఛేదన
రేపటి చితిలో బూడిదైన శ్వాసే
అంతరించు ప్రపంచంలో జీవజాలం
మనిషి లేని మానవ జాతి శూన్యమే
మనిషి ఆశల ఊసే అడవి గాలి
మనిషి జీవించు నిజమై అవని
అడవి అందాల సుమగంధాల
మధురిమల సరిగమలు అడవి
అంతర్జాతీయ అటవీ దినోత్సవం నేడు
నదులు పారు ఆరోగ్యసీమ అడవులై
3.
దారం ఆధారంగా
తెర వెనుక ఆడే బొమ్మలాటే
తోలుబొమ్మలాటగా వెలిగింది
తొలి జానపద కళారూపమై
హరికథలూ, బుర్ర కథలూ,
వీధి నాటకాల వంటి
ఏ కళలూ ధరణిలో లేనినాడే..
ఈ కళారూప చరిత్ర క్రీస్తు పూర్వం
ఒకటవ శతాబ్దం నాటిదిగా ఉంది
16-17వ శతాబ్దాలలో పరిఢవిల్లే
తెలుగు నేలలో మొదటగా...
తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్,
రాజస్థాన్ రాష్ట్రాల్లోకి విస్తరించింది
తోలుబొమ్మలాట కళా ప్రక్రియ
కాలక్రమాన విదేశాల్లోకి పాకింది
మనిషి ఆటవిడుపు కోసం
బొమ్మలైన మనిషి ఆడీ ఆడించే
తోలుబొమ్మలాట మనసు మురియగా
దారం ఆధారంగా ఆడించే బొమ్మల
నీతి కథల నేర్పు బొమ్మల నటనలో
నేర్పు ఓర్పుతో సృజన ప్రదర్శనలో
ముదమునొంద జనమై జగమే...
తోలుబొమ్మలాట వెల్లి విరిసింది
సర్వ కళల పారమార్ధం ఒక్కటిగా
కష్టించిన మనిషికి వినోదం
ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవమైన నేడు....
సాధారణ రోజేమీ కాదు
అరుదైనదీ అద్భుతమైనది కూడా
మూడు ప్రపంచ దినోత్సవాలూ
ముప్పేటలా అల్లుకున్నవి
ముప్పిరిగొన్న
మోట బొక్కెనకు కట్టిన దండెడలా
ఆలోచనానందాలాడే డెందాలన్నీ
ఒకేరోజు ఇన్ని పండుగలొస్తే
మనసు ఆడెను పరవళ్ళ నురుగుల నాట్యమై
అవని పాడెను మనిషిలో చిగురుల బాల్యమై
1.
ఒక అక్షరం
నేలంతా దున్నిన కవితైంది నేడు
ప్రపంచం కన్న కలల
విహ్వల నేత్రాల దృశ్యపు నీడలు
ఒక చీకటిలోంచి ప్రవహించే వెన్నెల
ఓ వేకువలోనే స్రవించే తిమిర వేదన
అతలాకుతలమైన మట్టిలో
పట్టి కుదిపేదే ఔషధ కవిత్వం
పూలతోట శవాల బాటగా మారినా
గడ్డి మైదానంలో ఊపిరి ఎగిసింది
బతుకులో ప్రతీరోజూ పూస్తుంది
కానీ ప్రతి పూసే పూవూ
వైవిధ్యం రంగూ వాసనల్లో
భావోద్వేగాలతో నిండిన కవిత్వంలో
లయల అలలు ఈదే హృదయం సంద్రమైంది
ప్రపంచం కవితా దినోత్సవమై నేడు
2.
అమూల్యమైంది అడవి
మూడొంతులపైన ప్రపంచ భూమి
ప్రాణమైంది జీవులకు అడవిగా
వృక్షజాలం జంతుజాలం జలజాలం
జీవాధారంలో మనిషి మనుగడుంది
స్వేచ్ఛలోని గాలీ,బతుకులో ఊపిరి
తేట తేట యేరూ,స్వచ్ఛమైన నీరూ
ప్రాణాధారమై పారేవన్నీ అడవి ఆత్మే
అడవంటే నిశ్శబ్దం కాదు
సకల ప్రకృతి ధర్మాల జీవన లోగిలి
హరిత లతల నింగి శబ్దనిలయం అడవి
నేడు స్వప్నించే వృక్షజాల ఛేదన
రేపటి చితిలో బూడిదైన శ్వాసే
అంతరించు ప్రపంచంలో జీవజాలం
మనిషి లేని మానవ జాతి శూన్యమే
మనిషి ఆశల ఊసే అడవి గాలి
మనిషి జీవించు నిజమై అవని
అడవి అందాల సుమగంధాల
మధురిమల సరిగమలు అడవి
అంతర్జాతీయ అటవీ దినోత్సవం నేడు
నదులు పారు ఆరోగ్యసీమ అడవులై
3.
దారం ఆధారంగా
తెర వెనుక ఆడే బొమ్మలాటే
తోలుబొమ్మలాటగా వెలిగింది
తొలి జానపద కళారూపమై
హరికథలూ, బుర్ర కథలూ,
వీధి నాటకాల వంటి
ఏ కళలూ ధరణిలో లేనినాడే..
ఈ కళారూప చరిత్ర క్రీస్తు పూర్వం
ఒకటవ శతాబ్దం నాటిదిగా ఉంది
16-17వ శతాబ్దాలలో పరిఢవిల్లే
తెలుగు నేలలో మొదటగా...
తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్,
రాజస్థాన్ రాష్ట్రాల్లోకి విస్తరించింది
తోలుబొమ్మలాట కళా ప్రక్రియ
కాలక్రమాన విదేశాల్లోకి పాకింది
మనిషి ఆటవిడుపు కోసం
బొమ్మలైన మనిషి ఆడీ ఆడించే
తోలుబొమ్మలాట మనసు మురియగా
దారం ఆధారంగా ఆడించే బొమ్మల
నీతి కథల నేర్పు బొమ్మల నటనలో
నేర్పు ఓర్పుతో సృజన ప్రదర్శనలో
ముదమునొంద జనమై జగమే...
తోలుబొమ్మలాట వెల్లి విరిసింది
సర్వ కళల పారమార్ధం ఒక్కటిగా
కష్టించిన మనిషికి వినోదం
ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవమైన నేడు....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి