ఇంటి దీపాలు- ఆడపిల్లలు;బీ వి వి సత్యనారాయణ;-అమలాపురం9912233739;-కలం స్నేహం
 ఇంటికి దీపాలు 
కంటి పాపలు
ఆడపిల్లలు/
అమ్మనాన్నలకు
ఆసరా/
ఇంటి పనులకు
చేయూత/
మనసెరిగి నడచుచు
ఇంటిపట్టు విడువక
మసలుకుంటారు/
మనసెరిగి నడచుకుంటారు/
నాన్న నాలుగు రోజులు
కనబడకపోతే ,
అమ్మ నీరసించి లేవకపోతే
తల్లడిల్లుతారు /
చిన్న చిన్న వాటికి మారాము చేసినా
సముదాయిస్తే మాత్రం సద్దుమనిగిపోతారు/
చెప్పినమాట శ్రద్ధవహించి వింటారు ఆడపిల్లలు/
అమ్మ నాన్నల కష్టాన్ని ఇట్టే అంచనా వేసి అనుగుణంగ నడచుకుంటారు/
సంస్కారవంతులు
సంసారభారమెరిగిన పడతులు ఈ ఆడపిల్లలు/
అందుకే ఆడపిల్లలు ఇంటికి దీపాలు
కంటి వెలుగులు !!

కామెంట్‌లు