నీతికి నిలువెత్తు దర్పణం ; -ఆయ్యలసోమయాజుల ప్రసాద్-రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతివిశాఖపట్నంచరవాణి:-9963265762
అగ్రవర్ణ భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబంలో 
కేరళ లోని ఎలాంకుళం లో జన్మించి అందవిశ్వాసాలు
అభివృద్ధికి నిరోధాలని 
మానవసేవే మాధవ సేవ అని అణగారిన, తాడిత, పీడిత ప్రజలకోసం పోరాడిన నిష్కళంక దేశభక్తుడు నంబూద్రి

స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని భరతమాత దాస్యశృంఖల విముక్తికై పోరాడిన నంబూద్రి 
కేరళ మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీకి మొదటి ముఖ్యమంత్రి గా ఎన్నికై భూసంస్కరణలు,
ప్రజాసంక్షేమ కార్యక్రమాలని  అమలుపరచి తన భూములపై వచ్చే ఆదాయాన్ని ప్రజాలకోసమే ఉపయోగించిన ప్రజాలపెన్నిధి నంబూద్రి

కులమతాభేదాలు ఉండవని మనుషులంతా ఒకటే అని కులవ్యవస్థ నిర్మూలనకై శ్రమించిన 
సమజాహితుడు
అక్షరాస్యత ఉంటే అభివృద్ధికి కారణమని విద్య అందరికి ఉండాలని
విద్యావ్యాప్తికై కృషిచేసి
నేడు కేరళ దేశంలోనే
వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా పునాదులు వేసిన సరస్వతీ పుత్రులు నంబూద్రి.

ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నికై రాష్ట్ర దశా-దిశా మార్చి,అనేక రచనలు చేసి,కేరళ చరిత్ర ద్వారా రాష్ట్రాన్ని  ప్రపంచానికే పరిచయం చేసి,పూర్ణయుర్దాయం తో జీవించి మలయాళ ప్రజల
హృదయాలలో చిరంజీవిగా నిలచిన నంబూద్రి మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి
నీతికి నిలువెత్తు దర్పణం.
మీకివే మా శతకోటి వందనములు.......!!


కామెంట్‌లు