ప్రపంచ జల దినోత్సవం;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్9963265762
 (మార్చి 22 వ తేది)
..................................
జీవరాశి మనుగడకు పంచభూతాలు ఆధారం
అందు ప్రధానమైనది జలం
ఆహారం లేక పోయినా ప్రాణి కొన్ని దినములు జీవించ గలము. కానీ నీరు లేనిదే నిమిషమైన జీవితం
గడవడం సాధ్యం కాదు.
స్వచ్ఛమైన నీరు సమస్త జీవకోటి మనుగడకు ఆధారం. నీటిని కల్మషం చేయకు, వృదాచేయకు
నీటిని ఒడిసి పెట్టి పట్టుకో
ప్రతి ఇంటా నీటి ఇంకుడు గుంతలు ఉంచి వాన నీటిని పరి రక్షించు.
అణుయుద్ధాల కన్నా ప్రమాదమైనవి నీటికొరకు జరిగే రాబోయే జలయద్దాలని జల పరిరక్షణ సమితి చెప్పినది గుర్తుంచుకో
రాష్ట్రాల మధ్య నదుల సంధాన జలవివాదాలే దీనికి తార్కాణం.
ఐక్యరాజ్య సమితి1993 మార్చి22 నుంచి ప్రపంచ జల దినోత్సవం గా నీటి పరిరక్షణ గురించి ప్రపంచ దేశాలన్నింటికి రాబోయే నీటి ఎద్దడి దానివలన జరిగే ముప్పు చెపుతుంది
కావున జలపరిరక్షణ కు కంకణం కట్టుకుని వసుదైక
కుటుంబాన్ని సస్యశ్యామలం గా ఉంచుదాం. జీవకోటి మనుగడకు జలపరిరక్షణ చేద్దాం......!!

...............................

కామెంట్‌లు