ఆటవెలది పద్యాలు;-యస్. అఖిల9వ తరగతి ,ఈ/యం జి.ప.ఉ‌.పా ,కుకునూర్ పల్లికొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.
 1.
ఆటలాడు వేళ ఆడు  కొనవలయు
చదువుకొనెడి వేళ చదువ వలయు 
బాల్య మందు నేర్వ పనులన్ని అబ్బురా!
అఖిల మాట విను అద్భుతమ్ము .
2.
కులము మతము నెంచకూడదు జనులార!
తెలివి తోడ బ్రతుక తేజమొసగు 
కులము నెంచ వలదు కూడుదినెడికాడ 
అఖిల మాట వినుము అద్భుతమ్ము .


కామెంట్‌లు