సునంద భాషితం;-వురిమళ్ల సునంద ఖమ్మం
 మాట మార్చే వారితో..
******
మాట మార్చే వారితో  మసలడం మహా కష్టం. అలాంటి వారితో ఏదైనా అవసరమైనప్పుడు  బాగా లోతుగా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవడం మంచిది.
వాళ్ళను అమాయకంగా గుడ్డిగా నమ్మామంటే నిండా నట్టేట్లో మునిగినట్టే. ఆకాశంలో మబ్బులు చూసి దోసిట్లో నీళ్ళు వదులుకోవడం లాంటిది.
పైకి చెప్పే మాటలు లోలోపల ఉండే ఆలోచనలు పూర్తి వ్యతిరేక దిశలో పనిచేస్తుంటాయి.
అలాంటి వారిలో ఓ దిశా నిర్దేశం కానీ  సంపూర్ణ వ్యక్తిత్వం కానీ, ఏదైనా నిర్ణయానికి కట్టుబడే ఖచ్చితత్వం కానీ ఉండదు.
 అలా చేయడంలో తాత్కాలిక ఆనందం పొందవచ్చేమో కానీ తర్వాత మానసికంగా చింతించే పరిస్థితి తప్పకుండా వస్తుంది.
ఒక్కోసారి స్వవిషయాల్లో మేలు కలిగే సందర్భంలోనూ అదే పోకడ పోవడంతో తీవ్రంగా నష్టపోతుంటారు.
అప్పుడు పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమే అవుతుంది.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు
Unknown చెప్పారు…
100% corret vadina v nice 👌👏