పిచ్చుకల సంరక్షణ (ప్రపంచ పిచ్చుకల దినోత్సవం);--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.
ముద్దుముద్దు పిచ్చుకలు
ముద్దులొలుకు పిచ్చుకలు
చిన్నిచిన్ని ముక్కులతో
విందుజేయు  పిచ్చుకలు

చిన్న క్రిమి కీటకాలు,
గింజలు  ఆరగిస్తాయి 
గోధుమ-ఊదా రంగు
తనువుతో మురిపిస్తాయి

అధిక రేడియేషన్తో 
అంతరించనున్నాయి
నిర్లక్ష్యము వహిస్తే!!
'కనుమరుగు' అవుతాయి

గొంతులెండుతున్నాయి
కాస్త నీరు పెట్టండి
నేల రాలుపోతున్నాయి
ఇక దృష్టి సారించండి

చేపట్టాలి శీఘ్రమే
పిచ్చుకల సంరక్షణ
పిచ్చుకల దినోత్సవ
రోజున చేయాలి యోచన


కామెంట్‌లు