మగువ;-భారతి పెద్దపల్లి..;-కలం స్నేహం
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కవిత
====================================
ఓ అలసిసొలసిన  ఆలీ 
నీ మీద ఎవరికీ జాలి 
అందరాడిరి నీతో హోలీ 
అందరికి చేసి చేసి రెక్కలు కూలి 
అయ్యావు నీవు బలి 
అందరితో ఆడి ఆడి అయినా 
నీ సరిజోడి నీతో దెబ్బలాడి 
నీ జానెడు పొట్టకు నీ జీతం లేని పనికి 
సంసార సాగరాన్ని ఈదుతున్నావు 

జననం నీవై గమనం నీవై 
విశ్వలో గొప్ప పాత్ర నీవై 
సృష్టికి ప్రతి సృష్టిచేయు 
మానవ మనుగడకు ఆధారమైన మహిళ 
నీ సంసార బందనానికి బందివై 
బంధాలు బాధ్యతలు బరువులు బాధలు 
వీటితోనే సగం జీవితం గడిచి పోయె 
నీకంటు జీవితముందని మరిచి 
కొవ్వొత్తి లాగా అందరికి వెలుగును పంచితివి ......... 
నీబ్రతుకు నీకు  నచ్చినట్టు 
లేక పోయిన  అలవాటుచేసుకొని  అణిగి మణిగి బ్రతకుతూ..... . 
భగవంతుడు అన్ని చోట్ల ఉండ లేక   
 కొన్ని పనులను నీకు అప్పగించాడు.. 

ఓర్పు సహనం ఓదార్పు ఇచ్చి 
ఇంటింటీలో ఇంతిగా   అమ్మగా  నిలిపాడు  
తను తల వంచితే సహనం అనుకుంటారు 
తను ఎదురు తిరిగితే తట్టుకోలేరు 
ఆడదాన్ని అబలను చేసి ఆడుతే 
ఒక్కొక్కరిని తబలలా వాయిస్తుంది 
అంత సత్త ఉన్న మహిళ 
ఓ మహిళ నీకు జోహార్లు...


కామెంట్‌లు