సహస్రకవి పోలయ్య కూకట్లపల్లికి సముద్రాల ఫౌండేషన్ జాతీయ సాహితీ పురస్కారం
 హైదరాబాద్ శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం మెయిన్ హాలులో మంగళవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో ప్రముఖకవి కేంద్ర అకాడమీ అవార్డు గ్రహీత  శ్రీ కొలకలూరి ఇనాక్  మరియు రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ చంద్రకుమార్ ల చేతులమీదుగా
శ్రీమతి సముద్రాల శ్రీదేవి వ్రాసిన 16 పుస్తకాల మరియు గజల్స్ సిడి ఆవిష్కరణ ఘనంగా జరిగింది...
నాళేశ్వరం శంకరం క్లుప్తసౌందర్యంగా సమీక్ష చేశారు
ఈ ఆవిష్కరణ సభకు కళారత్న మహాకవి శ్రీ బిక్కికృష్ణ అధ్యక్షత వహించారు. నేటి నిజం సంపాదకులు 
శ్రీ భైసా దేవదాస్ ఇంకా అనేకమంది సాహితీమూర్తులు పురప్రముఖులు సభకు హాజరయ్యారు
ఈ సందర్భంగా జరిగిన కవిసమ్మేళనంలో 
ప్రముఖ సహస్రకవి శ్రీ పోలయ్య కూకట్లపల్లి 
"ఓ మహిళామణులారా మేల్కోండి...
మీరు అనంత శక్తి స్వరూపులని తెలుసుకోండి"
అను శీర్షికతో కవితా గానం చేశారు
ఇప్పటి వరకు రమారమి 1600 కవితలు 130 కరోనా కవితలు 250 వేమన పద్య కవితలు వ్రాసి 7 పుస్తకాలను ముద్రణ చేసి తాను చేస్తున్న సాహితీకృషికి గుర్తింపుగా
కళారత్న శ్రీ బిక్కికృష్ణ మాజీ యం.పి. శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి చేతుల మీదుగా సముద్రాల ఫౌండేషన్ వారి జాతీయ సాహితీ పురస్కారం అందుకోవడం
తన అదృష్టమని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పోలయ్య 
కవి కూకట్లపల్లి వారందరికి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ సందర్భంగా తన కవితలను ఆదరిస్తూ తననెంతగానో ప్రోత్సహిస్తున్న పత్రికా సంపాదకులకు...తనను ఎంతగానో అభిమానించే కవిమిత్రులకు...కవయిత్రులకు...
పోలయ్య కవి కూకట్లపల్లి అభినందనలు తెలియజేశారు


కామెంట్‌లు