" ఓ మగువ నీకు వందనం";-మొలక


 శ్రీలంబోదర  కల్చరల్ అకాడమీ, సిరిసిల్ల  వారి సౌజన్యంతో అంతర్జాతీయ  మహిళా దినోత్సవం పురస్కరించుకొని 
" ఓ మగువ  నీకు వందనం"
జాతీయ   స్థాయి స్టార్ మహిళా  పురస్కారం మంగళవారం రోజున
సినారె కళామందిర్  , సిరిసిల్లలో జరిగింది. సాహిత్య రచనలతో ముందుకెళ్ళుతున్న సిద్ధిపేటకు చెందిన కవయిత్రులు మచ్చ అనురాధ, ఏడ్ల లక్ష్మి లు దంబోదర పురస్కరాలను డా|| లిలా శిరీష చంద్రశేఖర్,  అలివేలు మంగమ్మ, జూపల్లి  మంజుల రావు, డా||  రాధామోహన్ ల చేతుల మీదుగా "ఓ మగువ నీకు వందనం"  జాతీయ స్థాయి స్టార్ మహిళా పురస్కారం  అందుకున్నారు. అనురాధ, లక్ష్మీ పురస్కారాలు అందుకున్న సందర్భంగా సిద్ధిపేట కవయిత్రులు అభినందనలు తెలిపారు.
కామెంట్‌లు