స్వర్ణ కమలం;-ఆకుమళ్ల కృష్ణదాస్;-కలం స్నేహం

 అరుణ కిరణాల సువర్ణ సోయగమై
వినీతుని జీవన జాబిలివై
అలరించే ఆహ్లాద ఆమనివై..అతని శిరోమణివై
మణిమయ భూషితమైన ఇద్దరు సుతలకు
గర్భకోటను పాలచెలిమను ప్రసాదిస్తూ
జన్మ భాగ్యమొసగిన మాతృమూర్తివి!
అల వెంటబడే కష్టాల కారుచీకట్లను 
పతిదేవుని అండతో పటాపంచలు చేస్తూ..
జీవితాన్ని ఎక్కేస్తున్న పర్వతారోహిణివి!
రెక్కలింకా రాని రెండు చిన్ని చిలుకల్ని
నీ రెక్కలకిందే దాచుకున్న అమృత మూర్తివి!
వారికి చక్కని విద్యాబుద్ధులు నేర్పిస్తున్న వాగ్దేవివి!
పని ముగించుకొని పతిదేవుడు ఎన్నాళ్ళకొచ్చినా
పరవశించిపోయే నిదురపోని ఊర్మిళవు!
రోజూ పిల్లలకు కథలు చెబుతూ పాటలు పద్యాలు నేర్పిస్తూ
వారి భవితను చక్కగా మలుస్తున్న పంతులమ్మవు!
పిల్లలతోనే ఆడుతూపాడుతూ వారితోనే కలిసిపోయే
చిక్కని వెన్నెల నవ్వుల నెచ్చెలి వీవు!
అలుపెరుగని నీ పోరాట పటిమకు
శత సహస్ర అభివందనములు
అందుకోవమ్మా! వినీతుని పునీత కమలానివై!!

కామెంట్‌లు