సునంద భాషితం;-వురిమళ్ల సునంద ఖమ్మం
 జారిన--చేజారిన...
*******
జారిన--చేజారిన...ఇవిరెండూ  జీవితాన్ని అనూహ్యంగా మలుపు  తిప్పగలవు.వీటి పట్ల  అప్రమత్తత ఎంతో అవసరం.
నోటి నుండి జారిన మాటను వెనక్కి తీసుకోలేం.అది ఎదుటి వారి గుండెల్లో కలకలం సృష్టించ వచ్చు.
మంచిమాటైతే ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడనూ వచ్చు.
 చేజారిన అవకాశం ,కాలం ఎంత వగచినా తిరిగి రావు.పక్షిలా కళ్ళముందే తటాలున ఎగిరిపోయి కన్నీళ్లు తెప్పిస్తాయి.
అందుకే  వచ్చిన మంచి అవకాశాన్ని చేజారి పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి.
 అనుచితమైన మాటను జారకుండా, అద్భుతమైన అవకాశాన్ని  చేజారకుండా చూసుకోవడంలోనే విజ్ఞత వివేకం ఆధారపడి ఉంటాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు