నిర్భయం!;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 1.ఉరితాడుకి అంతపురా!
   నా కంఠానికి బిగియడానికి!
   బుల్లెట్ కి ఏమంత వేగం!
   నాకున్నది మనోవేగం!
  ఏ కుట్రయినా భగ్నమే!
   నేను పెడుతున్నా లగ్నం!
  ఏ ఆయుధం ఏమి చేయలేదు!
  నా దగ్గరున్నది వజ్రాయుధం!
  నా మార్గం నిష్కంటకం!
  నా ఆశయం నిష్కల్మషం!
2.నిరంకుశులు శాశ్వతులా!
   కాలాంకుశం కాలరాసింది!
  నాయకులు వంచకులైతే!
  ప్రజలు కన్నెర్ర చేస్తారు!
  క్షణం లో పతనమవుతారు!
  పదవులు తాటాకు మంటలే!
  ప్రజా చైతన్యం వెల్లువవగా!
   వ్యూహాలేవి నిలువవుగా!
అందంగాఎన్నిఅబద్ధాలాడినా!
దాగని నిజం బయటకొస్తుంది!
 నీకున్నది అధికారదాహం!
 తీరదన్నది తేటతెల్లం!
3.తెలివిగా తప్పులు,
                     చేస్తున్నావు!
   నూరు దాటావో,
            తల తెగి పడుతుంది!
   ఇంద్రజాలం అనుకుంటావు!
   అంతర్జాలంలో తెలిసిపోదా!
  బతుకు వీధి న పడుతుంది!
  అతుకు ఊపిరి పోతుంది!
  ప్రజలు గొర్రెలే,వాళ్ళే!
  నీ పుర్రెలో ఉన్నది,
           తెలిసికొని తీరుతారు!
 నాటి జార్ చక్రవర్తుల తీరు!
 నేటి ఉక్రెయిన్ యుద్ధం జోరు!
 చరిత్ర చెప్పే పాఠం ఒక్కటే!
  తిరుగుబాటు దండోరా డప్పు!
  దెబ్బతిన్న వాడి గుండె!
________

కామెంట్‌లు
BSN Murty చెప్పారు…
Very nice..