నేతిచిత్రకవిత * ఆనంద హేల *--కోరాడ నరసింహా రావు

 పిల్లలొస్తున్నారంటే...ఆ ఇంటికి 
పండగొచ్చేసినట్టే... !
    అమ్మమ్మలకూ నానమ్మలకు 
క్షణం తీరికుండదు !!
సందడే... సందడి !  హడావుడంటా, పెద్దమ్మలు, పిన్న మ్మలు, అత్తమ్మలదే !
రక,రకాలపిండివంటలఘమ .. 
 ఘమలతో  ఇళ్లంతా నిండి పోతుంది !
ఆఘుమ,ఘుమలు... ఘమ, ఘమలే మనుమలు, మనుమరాండ్రందరికీ ముందు స్వాగతం పలికేది !
   ఎంతశ్రమపడ్డా అసలు అల సటేఅనిపించదు,ఆనందంతప్ప  ఆపెద్దలలకు!
    నోరూరించే ఆ వంటకాల రుచులకంటే... ఆ పెద్దవాళ్ళ ప్రేమాభిమానాలు,ఆప్యాయతానురాగాలు... ఇరుగుపొరుగుల 
చిరునవ్వుల స్వాగత పలకరిం పులే ఎంతో రుచిగా చెప్పలేని ఆనoదాన్నిస్తాయి ఆ పిల్లలకు!
     పాతస్నేహితులు, ఆటలు, పాటలు, షికార్లు, కబుర్లు... !
పట్నాన్ని పూర్తిగా మరచిపోయి 
ఆనందంలో మునిగిపోవటమే!
.తినుబండారాలతో పాటు... 
ఆ తీపిజ్ఞాపకాల మూటలు నెత్తికెత్తుకుని..., అప్పుడే వెళ్లిపోవాలా... !? అనే దిగులు!
    మళ్ళీ ఏప్పుడు  రావాలా అనే తలపులు... !!
     ********
కామెంట్‌లు