సూక్తులు - ( విషయము)సేకరణ- పెద్ది సాంబశివరావు

 @ విమర్శలన్నింటిలో ఉత్తమమైనది ఆత్మ విమర్శ.
@ విముక్తి ప్రభుత్వాలకు కాదు, ప్రజలకు రావాలి. 
@ విరహభక్తి యెదను వికలమ్ము సేయగా~వైద్యుడేమొ నాడిబట్టి చూచు~ఎదను మండు బాధ సదయు డెరుగుగాని~పరులకేమి తెలియు భ్రమలు తప్ప .కబీర్. (భూసురపల్లి)
@ విరిగిన గాజు  ముక్కను అతికించడం కష్టం, విరిగిన మనస్సును అతికించడం కష్టం.
@ విరిగిన గాజుముక్కను, విరిగిన మనసును అతికించడం అతి కష్టం. 
@ విరిగిపోవడం కంటె వంగిపోవడం మేలు. స్కాట్లండ్ సామెత

కామెంట్‌లు