* అమరవీరుల దినోత్సవం *---కోరాడ నరసింహా రావు

        @ అజరామరం @
        ********
వారిజీవితం అజరామరం !
వారిస్థానం చరిత్రలో చిరస్థాయి 
శివాజీ, ఝాన్సీ వంటి క్షత్రియు  యులైతేనేమి..గాంధీ,మండేలా వంటి మహాత్ములైతేనేమి, భగత్ సింగ్, చంద్రశేఖర్ వంటి 
దేశభక్త పౌరులైతేనేమి, అల్లూరి వంటి మన్యవాసులైతేనేమి... 
అజరామరమైన వారి జన్మలు ధన్యం !
పుట్టినాక చావు తప్పదు కదా !
ఆచావుఅమరత్వమైచిరస్థాయి గాచరిత్రలోనిలవటంఎంతగొప్ప
ఆ మహాభాగ్యం అందరికీ దక్కుతుందా... !?
 జీవచ్ఛవాల్లా బ్రతికే కన్నా...., 
ఈ దేశం కోసం, ప్రజలందరి మేలుకోరి ప్రాణత్యాగాలను 
సిద్ధపడిన వారిజన్మలే జన్మలు!
వీరమరణంతో  తర తరాల గుండెల్లో చిరస్థాయిగా బ్రతికి ఉండటం * గొప్ప * కదూ !
    జైహో అమరవీరులారా 
జయ జయ జయహో.... !
     *******
కామెంట్‌లు