పెరుగుతు ఉన్నది చేనూ;-గంగదేవు యాదయ్య

 పెరుగుతు ఉన్నది చేనూ 
చూస్తూ ఉంటిని నేనూ 
దుక్కులు దున్నెను రైతూ 
మేలుగ దున్నెను రైతూ
విత్తులు వేసెను రైతూ...
నారును పోసేను రైతూ
నీరును పట్టెను రైతూ....
పెరుగుతు ఉన్నది చేనూ
చూస్తూ ఉంటిని నేనూ ....
కలుపులు తీసెను రైతూ
ఎరువులు వేసెను రైతూ....
పెరుగుతు ఉన్నది చేనూ
చూస్తూ ఉంటిని నేనూ ....
కంచెలు వేసెను రైతూ
కాపులు కాసెను రైతూ....
పగలూ రాత్రీ రైతూ
పహరా కాసెను రైతూ...
పువ్వులు రాగా రైతూ
పువ్వై మురిసెను రైతూ
గింజలు రాగా రైతూ
గింజై మురిసెను రైతూ
కాయలు రాగా రైతూ
కాయై మురిసెను రైతూ
పంటలు పండగ రైతూ
పండగ చేసెను రైతూ..
పెరుగుతు ఉన్నది చేనూ
చూస్తూ ఉంటిని నేనూ ..

కామెంట్‌లు