సంస్కారం @కోరాడ నరసింహా రావు
    తిట్టటానికి  అతను నా... 
         శత్రువు కాడు !
    పొగడటానికి  ఇతను నాకు 
        చుట్టమూ కాడు !!
అనిపించిన గుణాలనే కాడు... 
     కనిపించిన దోషాలనూ 
         ప్రస్తావించాను అంతే... !
  పిచ్చి అభిమానులకు... 
    దోషాలుకనిపించకపోవచ్చు!
ద్వేషించేవారికైతే...ఎదుటివారిలో,ఎన్నెన్ని మంచిగుణాలున్నా
మెచ్చుకోటానికి మనసొప్పక పోవచ్చు !
               నేను ఎవరికీ పిచ్చి అభిమానినీ కాను, దూషించే ద్వేషినీ కాను !
సంఘటనలకు యధతధంగా 
స్పందించే సాధారణ మనిషిని!
ఉన్నది ఉన్నట్టుగా తెలియజె  ప్పాల్సిన బాధ్యతాయుతు డనైన సాహితీవేత్తను !
ఎవరేమనుకున్నా... అన్నా... 
అది వాళ్లసంస్కారం !
వాటితో నాకు ప్రమేయం లేదు!
వీటికి,నామనసుస్పందించదు!!
        *******

కామెంట్‌లు