సునంద భాషితం;-వురిమళ్ల సునంద,ఖమ్మం
 మమ"కారం"- వెట"కారం.."
********
 మమకారం -వెటకారం రెంటిలోనూ కారం ఉంది..
ఇందులో వేటిలో కారం శాతం ఎక్కువైనా
పంచే వారికీ,పొందే వారీకీ ఇబ్బందే..
బంధాలతో ముడిపడిన మమకారాన్ని మోతాదుకు మించి పంచితే
చక్కగా ఎదగాల్సిన పాల మనసులకు మమ 'కారం' ఎక్కువై మాట వినకుండా తయారవుతారు.
ఈ బలహీనత వల్ల ఇష్టమైన వారి ప్రవర్తన బాగా లేకపోయినా భరిస్తూ బాధ పడవలసి వస్తుంది..
ఇతరులను తేలికచేసి మాట్లాడే వెటకారం ఎప్పుడూ 'కారం'గానే ఉంటుంది.
సున్నితమైన మనసున్న వారికి దీన్ని భరించడం కష్టంగా ఉండి ఆత్మ న్యూనతకు గురి చేస్తుంది కూడా.
 
అందుకే మమకారం-వెటకారం .. ఈ రెండింటి విషయంలో  చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు