అమాసకు
రాముల తీర్తం అయితే,
పున్నం కు
నల్లగొండ తీర్తం మొదలైతది.
గీ నల్లగొండ
ఎములాడ , సాతరాజ్ పల్లి, అట్నెంల, పాదుల్ నగరం దాటినంక అత్తది.
నల్లగొండ ఊరు సొర్రక ముందే
ఎడుమ పక్కకు
ఒక పెద్ద గుట్ట ఉంటది.
గా గుట్టమీద నర్సిమ్మ సామి గుడి ఉంటది. ఆ గుడి మా ఊరికి కూడా కనిపిత్తది.
ఎక్కడెక్కడి నుంచో శానా మంది కచ్చురాలు కట్టుకొని తీర్తం అచ్చేటోల్లు.
ఏ తీర్తం పోయినా
దేవుండ్లు మారుతరు గని
అండుక తినుడు,జాతర జూసుడు ఒక్క తీర్గనే ఉంటది.
పొద్దుగాలనే కచ్చురాలు కట్టుకొని రాముల తీర్తం
పోయేటోల్లం.
నల్లగొండ తీర్తానికైతే
పొద్దూకి నంక తిని కచ్చురాల్లల్ల
బయలెల్లే టోల్లం.
ఎందుకంటే
పొద్దు పొడువక ముందే
ఎగిలి వరంగనే తానాలు జేసి
గుట్ట మీదికి పోవాలె.
లేకపోతే గడిది ఎక్కువై
ఉందామన్నా జాగ దొరుకదు,
గుల్లె కు పోదామన్నా గింతనన్న సందుండదు.
గందుకనే పొద్దూకే నల్లగొండ గుట్ట కాడికి అచ్చేటోల్లం.
ఒగ సెట్టు కిందనో,
లేకపోతే ఐదారు కట్టే లతోని,ఆకులతోని
సిన్న పందిరేసుకొని
ఉండే టోల్లం.
దవ్వ దవ్వ తానం జేసి
దేవునికి పట్టె నామాలు,
కోర మీసాలను కొనుక్కొని
కొబ్బరికాయ గిట్ల తీస్కొని
గుల్లెకు పోయి మొక్కులు తీర్సుకునేటోల్లు.
ఇగ
పోరగాండ్ల కండ్లన్నీ
దేవుని మీద ఉండేది కాదుల్లా!
అవ్వోటి, ఇవ్వోటి కొనుక్క
తినుడు మీద,జాతరంత తిరుగుడు మీదనే ఉండేది.
శానా మంది సుట్టాలు గుడ
తీర్తంల కలిసేటోల్లు.
దేవునికి మొక్కులు అప్పజెప్పి అచ్చేటాల్లకు బువ్వ, కూర
తయారయ్యేది.
మా నాన
గుట్ట పక్కన్నే ఉన్న మోతుకు సెట్ల దగ్గరికి వోయి మోతుకాకులను తెంపుకచ్చి
మూడు ఇత్తార్లు కుట్టేటోడు.
మా అవ్వకోటి,మా నాన కోటి,నాకు సిన్న ఇత్తారు.
గా ఇత్తార్లల బువ్వ తింటే
మత్తు మంచిగనిపిచ్చేది.
గప్పటి పండగుల ,జాతర్ల సంబురం గిప్పుడు
లేనే లేదుల్లా!
ఔ మల్ల!
ఔ మల్ల,!;-,- బాలవర్ధిరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి