నమ్మరాదు! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివ సోము బడిఎగ్గొట్టి  ఆవారాగా తిరిగేవారు.తండ్రులకు ఆవిషయం తెలిసి బాగా తన్నారు.కానీ కిక్కురుమనకుండా భరించారు.నాన్నలు వ్యాపారం చేసేవారు. ఓసారి  ఆఇద్దరు ఊరికి వెళ్లితే శివా సోము  ఆరాత్రి ఇంట్లో అమ్మలు గాఢనిద్ర లో ఉన్నప్పుడు  ఇంట్లో ఉన్న డబ్బు కాజేసి స్కూల్ బ్యాగ్ లో పెట్టుకున్నారు. తెల్లారుతూనే స్కూల్ బ్యాగ్ తో బడికి వెళ్తున్నామని చెప్పి  అమ్మలకు బురిడీకొట్టి ఆఊరి చివర్లో ఉన్న  నదిదగ్గరకు వెళ్లారు. పడవవాడు నది ఆవలి ఒడ్డుకు చేర్చాడు.వీరితోపాటు ప్ర యాణిస్తున్న ఓదొంగ వీరిని గమనించి కబుర్లలో పెట్టి "ఓయ్ పిల్లలూ! ఇవ్వాళ ఇక్కడ సినిమా షూటింగ్ ఉంది. నాకు తెలిసిన చిన్న పూటకూళ్ల ఇంట్లో తిని అక్కడ నించి షూటింగ్ జరిగేస్థలానికి  పోదాం "అని చెప్పాడు. సినిమా పిచ్చి ఉన్న ఆఇద్దరు దొంగతో కలిసి అతను తీసుకుని వెళ్లిన ఆగుడిసెవైపు వెళ్లారు. ఆపాకలో ఒకామె అట్లుపోస్తోంది. దొంగ ఆమె తో ఏదో చెప్పాడు.శివా సోము ఆమెపెట్టిన దోసెలు తిని కాసేపటికి అలా నిద్ర మత్తు లో కూరుకుపోయారు. వారి కి మెలుకువ వచ్చేప్పటికి తమను తీసుకుని వచ్చిన మనిషి  దోసెలు వేసి న  ఆమె లేరు.సాయంత్రం అవుతోంది. స్కూల్ బ్యాగ్ లు కూడా లేక పోటంతో ఇద్దరు ఏడుస్తూ నదిదగ్గరకు వచ్చారు.అక్కడే ఓచేపలు పట్టేవాడు వారి కథవిని"ఏయ్!పిల్లలూ!నేను వలవేయగానే చేపలు  ఎలా అమాయకంగా నాచేతికి చిక్కాయో చూశారు కదా!అలాగే మీరు మోసగాడిచేత చిక్కారు.కొత్త వారు  పెట్టే ఆహారం తీసుకోరాదు.ఎవరినీ గుడ్డిగా నమ్మరాదు. అమ్మా నాన్నల మాటలు విని బుద్ధిగా బడికి వెళ్ళి చదువు కోండి"అని  తన పడవ లో వారిని  వారి ఊరి దగ్గర దింపటమేగాక ఇంటికెళ్లి వారి అమ్మలకు అప్పగించాడు.ఎంత చదువు కుని ఉద్యోగం చేసే వారంఐనా ప్రయాణం లో కొత్త వారు ఇచ్చే తినుబండారాలు తీసుకోరాదు🌹
కామెంట్‌లు