రాహుల్ విజయవాడ వెళ్ళాడు !వెళుతూ వెళుతూ కుసుమకు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు !
మనసు భారమై సర్వం కోల్పోయిన వాడిలాగా
ఇంకా చూస్తానో లేదో అనేటట్టు రాహుల్
మనసు మౌనం దాల్చింది! హృదయం ద్రవించింది!
కుసుమ అలా బాధ పడకండి మళ్ళీ వస్తారుగా
మీరలా బేలగా వుంటే నేనెలా తట్టుకోలేను!
విరహానికి తెర పడుతుందిలే నాగురించి
ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసు
కోకోండి !అని రాహుల్ కు చెప్పింది!
కానీ రాహుల్ కంటే కుసుమనే ఎక్కువ
బాధకు గురి అవుతోంది !ఏదో చెప్పలేని
దిగులేదో మనసును తొలిచేస్తోంది!
ఎంత తొందరగా రాహుల్ ను చేరుకుంటానో
అని తలపోస్తోంది! మనసు మనసులో లేదు!
రాహుల్ ని చూసేదాకా గుండె చిక్కి బెట్టుకుని
ఒక తపస్సులా తపస్వినిలా రాహుల్ కోసం
ఎదురు చూస్తోంది!
పరిమళించిన ప్రేమ కుసుమం పల్లవించిన
ప్రణయతాపం విరహాలన్నీ వేదనలై
చిలిపి తలుపులు మదిన పదే పదే
జ్జప్తికి రాగా తాళలేని హృదయం కాళరాత్రి కాగా
వెన్నెల వేడి నిట్టూర్పులా తోచి ఒక చోట నిలువలేని
మనసు గమ్యం లేని ప్రయాణం చేస్తూ
ఎన్నో ఎన్నో వింత భావాలకు లోనై కుసుమ
హృదయం దిగులు పాలైంది..!
రోజూ గణేష్ ను కలిసి వస్తోంది? కుసుమ
వాలకం చూసి గణేష్ వదినా దిగులెందుకు
అన్నయ్య రేపు వస్తాడు! రెండు రోజులకే
ఇలా డీలా పెడితే ఎలా మీరేమీ
ఆలోచించకండి అన్నయ్య నన్ను తిడతాడు
మిమ్మల్ని చూస్తే .!అని అనునయించాడు
కుసుమను.! కుసుమ ఏమీ మాట్లాడక
మౌనంగా వుండిపోయింది..!
కుసుమ మనసు పరి పరి విధాలా పోతోంది..!
తనపాటికి తను రాహుల్ ను చేసుకుని
వెళ్ళి పోతే ఇక తనవాళ్ళు చూడలేదు..!
అమ్మా నాన్నలు చెల్లి తమ్ముడిని విడిచి
వుండగలనా ?చుట్టాలు ఆప్తులు నన్ను ఎంతో
హీనంగా చూస్తారో! గీత చెప్పినట్టు మానాన్న
ఎవరినో ఒకరిని ముక్కూ మొహం తెలియని
వాడికి ఇచ్చి కట్టబెడితే నా పరిస్తితి ఏమిటి?
నాన్నకు ఆఉద్యోగం తప్ప కనీసం సొంత ఇల్లు
కూడా లేదు వచ్చే జీవితంలోనే కుటుంబ
పోషణ చేయాలి తమ్ముడుని చదివించాలి
చెల్లి బాగోగులు చూడాలి అందుకే నాన్న
ఎవరికో ఒకరికి ఇచ్చి కట్టబెడితే నేను
వారి గుండెలమీద కుంపటి దించినట్టు
భావిస్తారు.! దేవుడా నన్ను ఆడపిల్లగా ఎందుకు
పుట్టించావు స్వామీ.! మగ పిల్లవాడిలా పుట్టిస్తే
కనీసం నాన్నకు చేదోడు వాదోడుగా వుండేవాణ్ణి..!
పోనీలే నేను రాహూల్ తో వెళ్ళిపోతే కొన్నాళ్ళకు
మరిచి పోతారు.! నాకు పెళ్ళి చేసే బాధ
వాళ్ళకు తప్పుతుంది అని సరిపెట్టుకుంది..!
ఇంతలో?(సశేషం)తరువాత బాగం రేపే
మనసు భారమై సర్వం కోల్పోయిన వాడిలాగా
ఇంకా చూస్తానో లేదో అనేటట్టు రాహుల్
మనసు మౌనం దాల్చింది! హృదయం ద్రవించింది!
కుసుమ అలా బాధ పడకండి మళ్ళీ వస్తారుగా
మీరలా బేలగా వుంటే నేనెలా తట్టుకోలేను!
విరహానికి తెర పడుతుందిలే నాగురించి
ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసు
కోకోండి !అని రాహుల్ కు చెప్పింది!
కానీ రాహుల్ కంటే కుసుమనే ఎక్కువ
బాధకు గురి అవుతోంది !ఏదో చెప్పలేని
దిగులేదో మనసును తొలిచేస్తోంది!
ఎంత తొందరగా రాహుల్ ను చేరుకుంటానో
అని తలపోస్తోంది! మనసు మనసులో లేదు!
రాహుల్ ని చూసేదాకా గుండె చిక్కి బెట్టుకుని
ఒక తపస్సులా తపస్వినిలా రాహుల్ కోసం
ఎదురు చూస్తోంది!
పరిమళించిన ప్రేమ కుసుమం పల్లవించిన
ప్రణయతాపం విరహాలన్నీ వేదనలై
చిలిపి తలుపులు మదిన పదే పదే
జ్జప్తికి రాగా తాళలేని హృదయం కాళరాత్రి కాగా
వెన్నెల వేడి నిట్టూర్పులా తోచి ఒక చోట నిలువలేని
మనసు గమ్యం లేని ప్రయాణం చేస్తూ
ఎన్నో ఎన్నో వింత భావాలకు లోనై కుసుమ
హృదయం దిగులు పాలైంది..!
రోజూ గణేష్ ను కలిసి వస్తోంది? కుసుమ
వాలకం చూసి గణేష్ వదినా దిగులెందుకు
అన్నయ్య రేపు వస్తాడు! రెండు రోజులకే
ఇలా డీలా పెడితే ఎలా మీరేమీ
ఆలోచించకండి అన్నయ్య నన్ను తిడతాడు
మిమ్మల్ని చూస్తే .!అని అనునయించాడు
కుసుమను.! కుసుమ ఏమీ మాట్లాడక
మౌనంగా వుండిపోయింది..!
కుసుమ మనసు పరి పరి విధాలా పోతోంది..!
తనపాటికి తను రాహుల్ ను చేసుకుని
వెళ్ళి పోతే ఇక తనవాళ్ళు చూడలేదు..!
అమ్మా నాన్నలు చెల్లి తమ్ముడిని విడిచి
వుండగలనా ?చుట్టాలు ఆప్తులు నన్ను ఎంతో
హీనంగా చూస్తారో! గీత చెప్పినట్టు మానాన్న
ఎవరినో ఒకరిని ముక్కూ మొహం తెలియని
వాడికి ఇచ్చి కట్టబెడితే నా పరిస్తితి ఏమిటి?
నాన్నకు ఆఉద్యోగం తప్ప కనీసం సొంత ఇల్లు
కూడా లేదు వచ్చే జీవితంలోనే కుటుంబ
పోషణ చేయాలి తమ్ముడుని చదివించాలి
చెల్లి బాగోగులు చూడాలి అందుకే నాన్న
ఎవరికో ఒకరికి ఇచ్చి కట్టబెడితే నేను
వారి గుండెలమీద కుంపటి దించినట్టు
భావిస్తారు.! దేవుడా నన్ను ఆడపిల్లగా ఎందుకు
పుట్టించావు స్వామీ.! మగ పిల్లవాడిలా పుట్టిస్తే
కనీసం నాన్నకు చేదోడు వాదోడుగా వుండేవాణ్ణి..!
పోనీలే నేను రాహూల్ తో వెళ్ళిపోతే కొన్నాళ్ళకు
మరిచి పోతారు.! నాకు పెళ్ళి చేసే బాధ
వాళ్ళకు తప్పుతుంది అని సరిపెట్టుకుంది..!
ఇంతలో?(సశేషం)తరువాత బాగం రేపే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి