ఇంతలో గీత రావటం చూసింది ..!కుసుమను
రమ్మని సైగ చేసింది.! ఏమిటే అని గీతను అడిగింది
కుసుమ.! నేను బైటికి వెళ్ళి వస్తుంటే రాహుల్
కనిపించాడే.! నిన్ను సాయంత్రం రమ్మని చెప్పాడు.!
ఆ విషయం నీకు చెప్పుదామని వచ్చాను.!
ఏదో సంతోషకరమైన విషయమేదో వున్నట్టుండి
వెళ్ళి వచ్చి చెప్పవే .!నేనూ విని సంతోషిస్తాను
అని అన్నది గీత.! ఇదేమీ వినిపించలేదు
కుసుమకు.! రాహుల్ వచ్చాడు అనే మాటే
చెవులకు శ్రావణానందంగా వినిపించింది..!
మనసు మురిసిన వేళ మమతానురాగం
ఉప్పొంగి .!ప్రేమ వరదలో కొట్టుకుపోయే కుసుమ
హృదయం.! ఉరకలు వేసే గోదారిలా మారింది..!
ఈ రెణ్ణాళ్ళ విరహం యుగంలా కాగా .!
వేదనలన్నీ గాలి పింజాలై గాలిలో తేలుతూ..!
కలుసుకుంది తన ప్రేమ సామ్రాజ్యంలో ప్రియసఖుని.!
కుసుమ ను చూసిన రాహుల్ హృదయాలయంలో.!
కోటి వీణలు పలుకగా పరుగెత్తుకెళ్ళి కుసుమని.!
ప్రేమమీరా హృదయానికి హత్తుకోగా .!కుసుమ
సుమ మాలికలా అల్లుకుంది..!
అలా ఎంతోసేపు ఒకరిలో ఒకరు ఒదిగి పోగా..!
ఒక చిన్న బాబు రాహుల్ కాలుతట్టి పిలవగా..!
ఈలోకం లోకి వచ్చిన ఇద్దరికీ సిగ్గు
ఆవహించింది.! ఆ బాబు దూరంగా వున్న
వాళ్ళు తాతను చూపాడు..! ఆపెద్దాయన
ఇది పార్క్ కాదు పబ్లిక్ ప్లేస్ గుర్తుంచుకోండి..!
అని వార్నింగ్ లాంటి మందలింపును
విసిరి మనవడితో వెళ్ళాడు ..!
నన్నంటావు కానీ నువ్వే నాకన్నా ఎక్కువ
ప్రేమతో వున్నావే .!ఏమయ్యాయి నీ బిడియాలు
అని కుసుమ కళ్ళలో కళ్ళు పెట్టిన అనేసరికి..!
నా వల్లకాదు ఈ రెండు రోజులూ నేనెంతో
నరకం అనుభవించాను అన్నది గోముగా.!
ఇంకెన్ని రోజులులే ఇంకా కాసేపు కూడా
నీ కొంగు విడిచి వుండని రోజు దగ్గరిలోనే వుంది..!
అసలు విషయం చెప్పలేదు కదూ.! నన్ను ఒక వారం రోజుల్లో వర్క్ లో జాయిన్ కమ్మన్నారు..!
నా ఫ్రెండ్ ఒకడు వున్నాడు అక్కడ.! మన
ప్రేమ విషయం వాడికి చెప్పాను జాబ్ వచ్చిన
సంగతి వాడికి చెప్పాను మనం కోసం ఇల్లు
చూడమన్నాను సరే అన్నాడు..!
నేను జాబ్ లో జాయిన్ కాగానే ఒక మంచిరోజు
చూసి నిన్ను పెళ్ళి చేసుకుని తీసుకు వెళతాను..!
నీవు ధైర్యంగా వుండు డార్లింగ్ అని అన్నాడు
రాహుల్.! ఈ వారం రోజులు నీతోనే నేను
నాతోనే నీవు అని అనగానే కుసుమ మనసు
గువ్వ పిల్లగా మారింది ..!
రాహుల్ రెండు చేతులను తన చేతిలోకి తీసుకుని
అరచేతులు ముద్దాడింది .!అలా చాలా సేపు
మాట్లాడుకుని ఇల్లు చేరిన కుసుమను..!
ఏమిటే కుసుమా ఏమిటీ ఇంత లేటుగా వచ్చావు..!
ఈమద్య నీకు పెత్తనాలు ఎక్కువయ్యాయి..!
అదేమని అడిగితే నా స్నేహితురాలితో
మాట్లాడుతుంటే ఆలస్యం అయింది అంటావు..!
ఈడు వచ్చిన ఆడపిల్లవు చిన్నపిల్లవు కాదు
నాన్నగారికి తెలిస్తే కోప్పఢి ఆటైపు కూడా
మానిపిస్తారు.! కాస్త కుదురుగా వుండటం నేర్చుకో
నీకు పెళ్ళి చేసి పంపేదాకా మేము భయ పడాల్సి
వస్తుంది..! మాకు చెడ్డపేరు తేకు అని
మాటల యుద్దం మొదలు పెట్టింది..!
అలాగే లేవే అని అనగలిగింది కానీ చాలా
బాధకు గురి అయింది.! ఇన్నాళ్ళూ అమ్మ
నన్ను ఒక్క మాట కూడా అనలేదు నాదే
కదా తప్పు నా ప్రేమ గురించి ఆమెకు తెలియదు
రాహుల్ ను కలవాలంటే ఏదో ఒకటి చెప్పాలి..!
కదా?(సశేషం) తరువాత బాగం రేపే
త్వరలో రాహుల్ కుసుమల ప్రేమ కధను
అనూహ్యంగా మలుపు తిప్పబోతున్నా
మీఅభిప్రాయాలను తెలియజేయగలరు
ఎలాంటి ముగింపు రావాలి అని అనుకుంటున్నారు.!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి